Wednesday, September 11, 2024
spot_img

దేశాన్ని విచ్చిన్నం చేసే భారీ కుట్ర జరుగుతోంది..

తప్పక చదవండి
  • ఆందోళన వ్యక్తం చేసిన వీ.హెచ్.పీ. జాతీయ కార్యదర్శి మిలింద్ పరాండే..
  • మణిపూర్ సంఘటనలను బూచిగా చూపుతూ హిందూ, క్రిష్టియన్ వివాదంగా చూపుతున్నారు..
  • ఇలాంటి విద్రోహర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక..
    న్యూ ఢిల్లీ : మణిపూర్ లో జరుగుతున్న పరిణామాలను హిందూ, క్రిష్టియన్ మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.. కానీ ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదు.. పైగా ఇది అత్యంత ప్రమాదకరమైన వక్రీకరణగా భావించాలి.. దీనిని అంతా తిప్పికొట్టాలి.. అక్కడ కేవలం రెండు గిరిజన తెగల మధ్య మాత్రమే వివాదం కొనసాగుతోంది.. ఎవరైతే దీనిని హిందూ, క్రిస్టియన్ వివాదంగా చిత్రీకరించాలని అనుకుంటున్నారో వారి వెనుక ఒక రహస్య అజెండా దాగివుంది.. దేశాన్ని అస్థిరపరిచే భయంకరమైన కుట్ర నిబిడీకృతమై వుంది.. కాబట్టి మణిపూర్ వివాదంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని భారతీయులందరూ గమనించాలని, దానిని గుర్తించాలని వీ.హెచ్.పీ. జాతీయ కార్యదర్శి, మిలింద్ పరాండే భారత పౌరులకు సూచిస్తున్నారు.. అలాగే దేశ ద్రోహుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరిస్తున్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు