Wednesday, May 15, 2024

పార్టీ కోసం పనిచేసే వారికి తప్పకుండా అవకాశాలు : మల్లారెడ్డి

తప్పక చదవండి
  • బీఆర్ఎస్ పార్టీలోనే బీసీలకు తగిన గుర్తింపు లభిస్తుంది: కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమ

మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకు చెందిన కౌడే వెంకటేష్ మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా కౌడే వెంకటేష్ కురుమకి రాష్ట్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి చామకుర మల్లారెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెర్వుకొమ్ము శేఖర్ గౌడ్ లు నియామక పత్రాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్, మర్రి దీపికా నర్సింహ్మా రెడ్డి, మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాసురాది భాస్కర్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ వైస్ చైర్మన్ చీర్ల రమేష్ కురుమ, మేడ్చల్ పట్టణ మాజీ ఉప సర్పంచ్ మర్రి నర్సింహ్మా రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బ రామస్వామి ముదిరాజ్, మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శానాల విష్ణు చారి, మేడ్చల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు మండల రవి కుమార్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌడే నాగేందర్ కురుమ, పెంజర్ల భాస్కర్ యాదవ్, ఉద్దెమర్రి రాజు, నాచారం బాల మల్లేష్, కౌడే శ్రీశైలం, నాచారం మహేష్, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్స్, కో ఆప్షన్ సభ్యులు, తెలంగాణ ఉద్యమ కారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు