Saturday, July 27, 2024

హరీష్‌రావుని కలిసిన తెలంగాణ గౌడ సంఘం నేతలు

తప్పక చదవండి

హైదరాబాద్‌ : ప్రగతిభవన్‌లో మంత్రి హరీష్‌రావుని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్‌ రావు గౌడ్‌, ఉపాధ్యక్షులు నాచాగోని రాజయ్య గౌడ్‌, బద్దం ధనుంజయ్‌ గౌడ్‌లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి హరిష్‌రావు మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ గౌడ సంఘం ప్రతి జిల్లాలో ప్రచారం చేపట్టాలని, అలాగే మన బీఆర్‌ఎస్‌ పార్టీ గౌడ కులస్తుల కోసం తీసుకొచ్చిన పథకాల గూర్చి విస్తృతంగా ప్రజలకు వివరించాలని పల్లె లక్ష్మణ్‌ రావు గౌడ్‌కి సూచించారు. మళ్లీ బీఆర్ఎస్ ని గెలిపిస్తే మరిన్ని పథకాలతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే తెలంగాణలోనే ఉద్యోగుల జీతాలు ఎక్కువని గుర్తు చేశారు. కార్మికుల ఉసురుపోసుకున్న పార్టీ బీజేపీ అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు తుస్సయిపోయాయని.. రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటు చాలు అంటున్నడు… గతంలో పవర్ హాలిడేలు ఉండేవి. పారిశ్రామిక వేత్తలు ధర్నాలు చేసేవారు. ఇప్పుడు 24 గంటల కరెంటు వస్తుందని గుర్తు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు