Monday, May 13, 2024

దారి కాచి.. దారుణం..

తప్పక చదవండి
  • కత్తులతో నరికి ప్రభుత్వ ఉపాధ్యాయుడి హత్య..
  • ఈ హత్యకు ఆస్తి తగాదాలే కారణమా..?
  • పలు కోణాలలో విచారిస్తున్న పోలీసులు..

కూసుమంచి :
నాయకన్ గూడేనికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటాచారి (53) ని గుర్తుతెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసిన సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలం, ఈశ్వర మాదారం గ్రామపంచాయతీలోని శివారు గ్రామమైన మందడి నరసయ్య గూడెం చిన్న వాగు బ్రిడ్జి వద్ద చోటు చేసుకుంది. కూసుమంచి మండలంలోని నాయకన్ గూడెంలో వెంకటాచారి గతంలో ఓ స్కూల్ ను కూడా నిర్వహించారు.. ఆయన సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, సిరిపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల యందు పిఈటిగా విధులు నిర్వహిస్తున్నాడు.

రోజులాగానే బుధవారం ఉదయం 9:30 గంటల సమయంలో స్వగ్రామం నుండి సిరిపురం వెళ్తుండగా మందడి నరసయ్య గూడెం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించి, బైక్ ను ఢీ కొట్టి కిందపడిన వెంకటాచారిని గొంతు కోసి హత్య చేశారు. ఈ హత్య ఆస్తి తగాదాల నేపథ్యంలో జరిగినట్లు సమాచారం.. భువనగిరి మండలం శోభనాద్రిపురం గ్రామానికి చెందిన మేనల్లుడి దాసోజు శ్రీనివాస్ తన కుమార్తె కవితకు ఇచ్చి 10 ఏండ్ల కిందట వివాహం జరిపించాడు. గత ఏడాది నుండి మామ వెంకటాచారికి ఉన్న శ్రీ చైతన్య స్కూల్లో సగ భాగం ఆస్తి కావాలని అడగడం, మామ ఇవ్వకపోవడంతో అల్లుడు భార్య కవితను వేధించడం మొదలుపెట్టాడు. దీంతో 20 రోజుల క్రితం కవిత ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొంది ప్రస్తుతం తండ్రి వద్ద ఉంటుంది. ఆస్తి కోసమే అల్లుడు సుపారీ ఇచ్చి ఈ హత్య చేయించాడనే అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచార చేపట్టినట్లు తెలుస్తోంది.. సమాచారం అందుకున్న ఖమ్మం రూరల్ ఏసిపి బస్వారెడ్డి, కూసుమంచి సర్కిల్ ఇన్స్పెక్టర్ జితేందర్ రెడ్డి, ఎస్సై రమేష్ కుమార్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు