Friday, May 17, 2024

బాలికల హక్కులకు భంగం కలుగరాదు

తప్పక చదవండి

బాలికలు రేపటి జగతికి ఆశాజ్యోతులు.అమాయకమైన నేటి బాలికలే రేపటి జగతిని శాసించే మగువలుగా అభివర్ణించడంలో అతిశయోక్తి లేదు. పువ్వు పుట్టగానే పరిమళించునన్న చందంగా ఇప్పటి తరం బాలల్లో చిన్న వయసు లోనే తెలివి తేటలు అధికంగా ఉంటున్నాయి. వర్తమానంలో బాలికలు చదువుల్లో బాగా రాణిస్తున్నారు. అయితే ఆర్ధిక,సామాజిక పరిస్థితుల వలన బాలికలు పలు విషయాల్లో వెనుకంజ వేస్తున్నారు.5-14 సంవత్సరాల మధ్య గల బాలికల్లో అధికశాతం మంది ఇంటి పనులకే పరిమితమై పోతున్నారు.చిన్న వయసులోనే లైంగిక హింసకు,వేధింపులకు బలై పోతున్నారు.తినడానికి సరైన తిండి లేక,ఆర్ధిక స్థితిగతులు సరిగా లేక అనారోగ్య సమస్యలకు గూరౌతున్నారు.పాకిస్తాన్‌ కు చెందిన మలాలా యూజఫ్‌ జాయ్‌ ఉగ్రవాదుల బెదిరింపులకు సైతం లొంగక పాక్‌ లో బాలికల విద్య కోసం విశేషంగా కృషి చేసి బాల్య దశలోనే నోబెల్‌ బహుమతి పొంది, చరిత్రకెక్కిన విషయం గమనార్హం. ఆప్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఏలుబడిలో బాలికలు అనేక అరాచకాలకు బలై పోతున్నారు. అమెరికా నిష్క్రమణతో ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబాన్ల దమననీతి పునరావృతమైనది. ఆప్ఘనిస్తాన్‌లో మహిళల పట్ల కొనసాగుతున్న హింసను అరికట్టడంలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సమాజం ఘోరవైఫల్యం చెందడం ఆందోళనకరం. విద్య, వైద్య, ఆరోగ్య సంబంధిత విషయాల్లో అడుగడుగునా బాలికల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఎండగట్టి, బాలికల పట్ల సానుకూల దృక్పథం ప్రదర్శించడానికి ప్రతీ ఏటా అక్టోబర్‌ 11 వ తేదీన ‘‘అంతర్జాతీయ బాలికల దినోత్సవం’’(గర్ల్‌ ఛైల్డ్‌ డే) జరు గుతున్నది. తల్లిదండ్రుల, పెద్దల సహకారంతో బాలికలు నిర్మా ణాత్మక పంథాలో పయనించడానికి, సమాజంలో ఎలాంటి వివక్ష లేకుండా జీవించడానికి వివిధ రకాల దోపిడీల నుండి కాపాడబ డడానికి, ఇతరులతో సమానంగా,మరింత ఉన్నతంగా జీవించడా నికి తగిన ఏర్పాట్లు చేయడం, ఈ విషయంలో బాలికలకు అవగాహన కలిగించడం బాలికా దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఇప్ప టికే వివిధ రకాల పథకాల ద్వారా బాలికల స్థితి గతులను మెరు గు పరచడం జరుగుతున్నది. కొన్ని దేశాలు మినహా దాదాపు ప్రపంచ వ్యాప్తంగా బాలికా విద్యకు అనుకూలత లభిస్తున్నది. అయినప్పటికీ ఇంకా స్త్రీ అక్షరాస్యత మెరుగు పడలేదు. సమాజంలో బాలికలకు ఎదురౌతున్న సమస్యలను పరిష్కరించి, లింగ సమానత్వం సాధించడంతో మరింత కృషి జరగాలి. బాలుర తో పాటు, బాలికలకు కూడా సమాన విద్యా వకాశాలను అందిం చడంతో కొంత వరకు బాలికల పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఇటీవల భారత ప్రభుత్వం ఆడపిల్లల వివాహ వయోపరిమితిని 18 నుంచి 21 సంవత్సరాలకు పెంచడం జరిగింది. దీని వలన వారు వివాహాల చెర నుండి విముక్తి పొంది ఉన్నత విద్యావకా శాలు, ఉద్యోగావకాశాలు పొందడానికి వీలు కలుగుతుంది. ఇదే సందర్భంలో ఎన్నికల్లో పోటీ చేసే వయసును కూడా తగ్గించాలి. ఏది ఏమైనప్పటికి బాలికల తల్లిదండ్రుల్లోను, సమాజం లోను బాలికల అభివృద్ధి పట్ల సరైన అవగాహన కలగాలి. లేకపోతే ఎన్ని చట్టాలు తెచ్చినా,ఎన్ని సంస్కరణలు చేపట్టినా ఫలితం శూన్యం. సమానత్వం జన్మతః ప్రాప్తించిన సహజ సిద్ధమైన ప్రాథమిక హక్కు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే సమాజం ఏర్పాటు చేసుకున్న కట్టుబాట్లు, నియమ నిబం ధనలు, కుల, మత పరమైన విశ్వాసాలు, అనాదిగా పాటిస్తున్న ఆచార వ్యవహారాలు, ఆధిపత్య భావజాలం వంటి అంశాలు లింగ వివక్షతకు బీజం వేసాయి. స్త్రీ,పురుషుల్లో నెలకొన్న సహజ సిద్ధమైన మానసిక, శారీరక పరిణామాలను ఆసరాగా తీసుకుని ,ఆధిపత్యం చెలాయిం చాలనే ఆరాటం తలెత్తడం,నాటి కాలంలో నెలకొన్న సామాజిక రుగ్మతలు,కట్టు కథలు స్త్రీని మానసికంగా హింసించి, అబలగా చిత్రీకరించి, కేవలం వంటింటికే పరిమితం చేసేందుకు దోహద పడ్డాయి. మూఢవిశ్వాసాలు, నిరక్షరాస్యత ఆడపిల్లల పాలిట శాపంలా తయారైన నేపథ్యంలో భారత దేశంలోని పలువురు సంఘ సంస్కర్తలు తమ ఉద్యమాల ద్వారా, ప్రసంగాల ద్వారా, రచనల ద్వారా స్త్రీ స్వేచ్ఛకు ఊపిరి పోయ డానికి శతవిధాలా ప్రయత్నించి, కొంత మేరకు సఫలీకృ తులై నారు. బెంగాల్‌ కు చెందిన రాజా రామ్మోహన్‌ రాయ్‌ సతీసహ గమన దురాచారం పై పోరాడి, వితంతు వివాహాలను ప్రోత్సాహిం చాడు. బాలికల విద్య కోసం విశేష కృషి చేసాడు. రాజా రామ్మో హన్‌ రాయ్‌ అభ్యుదయ భావాలు బ్రహ్మ సమాజానికే కాకుండా, బెంగాల్‌ సాంస్కృతిక పునరుజ్జీవనానికి పునాది వేసాయి. ఈశ్వర చంద్ర విద్యా సాగర్‌ స్త్రీల జీవన స్థితిగతులను మెరుగు పరచడా నికి విశేష కృషి చేసాడు.బహు భార్యత్వానికి వ్యతిరేకంగా, వితంతు వివాహాలకు, బాలికల విద్యకు అనుకూలంగా ఉద్య మించాడు. జ్యోతి రావు ఫూలే,సావిత్రి భాయ్‌ ఫూలే 19వ శతాబ్ధంలో బాలికల విద్య కోసం నిర్విరామ కృషి చేయడం జరిగింది. స్వామి వివేకానంద శిష్యు రాలు సోదరి నివేదిత వివేకానంద ప్రేర ణతో ఐర్లాండ్‌ నుంచి భారత దేశానికి వచ్చి బాలికల విద్య కోసం ఎంతగానో పాటు పడిరది.గురజాడ అప్పా రావు కన్యాశుల్కం నాటకం ద్వారా సామాజిక పరివర్తనకు ప్రయ త్నించాడు. కందుకూరి వీరేశలింగం స్త్రీ విద్య కోసం, చిన్న వయసులోనే భర్తలను కోల్పోయి, వితంతువులుగా మారిన బాలికల కోసం వితంతు వివాహాలను ప్రోత్సాహించాడు. తెలుగు సాహిత్యం ద్వారా చలం ఆడవారి పట్ల సానుకూల వైఖరి ప్రదర్శిం చాడు. ఆర్య సమాజ స్థాపకుడు స్వామి దయానంద సరస్వతి కూడా స్త్రీ విద్య కోసం విశేష కృషి సల్పాడు.సరోజినీ నాయుడు ఒక స్త్రీ వాది, ఆడ వారి కోసం అహర్శిశలూ కృషిచేసి, నాటి కాలంలోనే మహిళల ఓటు హక్కు కోసం పోరాడిన వనిత గా పేరుగాంచింది.ఇలా ఎంతో మంది మహనీయులు, సంఘసం స్కర్తలు అణగద్రొక్క బడుతున్న ఆడజాతికి పురుషులతో పాటు అన్నిరంగాల్లో సమాన అవకాశాలు కల్పించడానికి ఇతోధిక సహాయం చేసారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ లో అప్పట్లో ఎన్టీరామా రావు ప్రభుత్వం మహిళల కు తండ్రి ఆస్తిలో సమాన వాటా కల్పించింది. మహిళలకు రిజర్వేషన్ల విషయం లోను, సమాజంలో వారికి తగిన గౌరవం కల్పించడం లోను ఎన్టీరామా రావు చూపిన చొరవ అభినందనీ యం. పెరిగిన అక్షరాస్యత వలన, ఉన్నత చదువుల వలన ఆడవా రిని గౌరవించే సంస్కృతి కూడా పెరిగింది. అయినప్పటికీ ఇంకా పలుచోట్ల అర్ధం లేని చాంధస భావాలు బాలికలను విద్యావకాశా లకు,అభివృద్ధికి దూరం చేయడం సిగ్గు చేటు సుమారు 13 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల లోపు వయసును యవ్వనం లేదా యుక్త వయసు అంటారు. యుక్త వయసు లోపు ఆడపిల్లల ను సాధారణం గా బాలికలు(గర్ల్‌ ఛైల్డ్‌) అని నిర్వచించవచ్చు. మానసిక పరిపక్వత రాని దశలో బాలికల పై పలు రకాల హింస కొనసాగుతున్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు