Tuesday, May 7, 2024

పార్టీ నిర్ణయమే ఫైనల్‌

తప్పక చదవండి
  • దానికి ఎవరైనా కట్టుబడాల్సిందే
  • అందుకు నేనేవిూ అతీతం కాదు
  • మైనంపల్లిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది
  • కెసిఆర్‌కు భయమంటే ఏమిటో తెలియదు
  • రెండుచోట్ల పోటీ చేయడం మా రాజకీయ వ్యూహం
  • మహిళా బిల్లు ఆకాంక్ష మహిళలందరిదీ
  • విూడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, ఎంతటి వారైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని, అందుకు తానుకూడా అతీతం కాదని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. మైనంపల్లి హన్మంతరావు వ్యవహారంపై ఆమె తీవ్రంగా స్పందించారు. పార్టీలో తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని అన్నారు. ఎవిరికి వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. గతంలో స్టేషన్‌ ఘనాపూర్‌లో రాజయ్యకు టిక్కెట్‌ ఇచ్చినప్పుడు కడియం శ్రీహరిగారు నిలబడి గెలిపించారని గుర్తు చేశారు. ఇప్పుడు కడియంకు సీటు ఇవ్వడం జరగిందన్నారు. గెలుపు అంశాలను దృష్టిలో పెట్టుకుని అధినేత కెసిఆర్‌ నిర్ణయాలు తీసుకున్నారని విూడియా సమావేశంలో అన్నారు. ఇక కెసిఆర్‌ రెండుచోట్ల పోటీ చేయడంపై కొందరు వక్రభాష్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్‌ భయపడి పోయారని చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. భయమంటే ఏమిటో కెసిఆర్‌కు తెలియదన్నారు. ఆయనచరిత్రలో భయం అన్న పదం లేదన్నారు. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా చర్యలు తప్పవని బీఆర్‌ఎస్‌ నాయకులను ఆమె హెచ్చరించారు. ప్రజాజీవితంలో ఉన్న ఎవరైనా సరే మర్యాదగా మాట్లాడాలని సూచించారు. ఎమ్మెల్యే టికెట్‌ రాని అందరికీ తగిన ప్రాధాన్యం కల్పిస్తామని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు భయమన్నది లేదని తెలిపారు. కాంగ్రెస్‌ ఆచరణ సాధ్యం కాని హావిూలు ఇస్తుందని ఆమె ఆరోపించారు. గత ఎన్నికల్లో హావిూలను ప్రజలు నమ్మలేదని అన్నారు. ఇకపోతే మహిళా రిజర్వేషన్లు తన వ్యక్తిగత ఎజెండా కాదని ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత అన్నారు. దేశంలోని మహిళలందరూ చట్టసభల్లో రిజర్వేషన్లు కోరుకుంటు న్నారని తెలిపారు. మహిళల రిజర్వేషన్ల కోసం అంబేడ్కర్‌ కూడా కొట్లాడారని ఆమె గుర్తుచేశారు. ప్రస్తుతం పార్లమెంటులో మహిళలు కేవలం 12 శాతం మాత్రమే ఉన్నారని అన్నారు. తొలి లోక్‌సభలో 8 శాతం మహిళా ఎంపీలే ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 12 శాతానికి మాత్రమే చేరిందని అన్నారు. మణిపూర్‌లో ఇప్పుడు ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారని తెలిపారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగానే మహిళలు మిగిలిపోవాలా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి, బీజేపీ నాయకులు అనవసరంగా తనపై విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 2010 రాజ్యసభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు.. 2023 వచ్చినా ఎందుకు ఆమోదం పొందడం లేదని ప్రశ్నించారు. 14 ఏండ్లుగా సర్కార్‌ మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని నిలదీశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లు కోసం వచ్చే డిసెంబర్‌లో మరోసారి దీక్ష చేస్తామని ఆమె ప్రకటించారు. ఈ దీక్షకు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, స్మృతి ఇరానీ సహా మహిళా నేతలు అందర్నీ ఆహ్వానిస్తామని తెలిపారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగినట్లు ఓ ప్రొఫెసర్‌ ఆరోపించారని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత.. దీన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏ పార్టీకి ఓటు వేసినా బీజేపీకే వెళ్తుందని ఓ ఎంపీ అనడం దారుణమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పై కవిత కామెంట్స్‌ చేశారు. రాజకీయాల్లో సంయమనం అవసరమని, బాధ్యతతో ఉండాలన్నారు. మైనంపల్లి కామెంట్స్‌ను ఖండిస్తున్నానన్నారు. ఆయన సీటు మార్పుపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేసిఆర్‌కు భయం అంటూ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడైనా నామినేషన్‌ వేసి గెలిచిన నాయకుడు కేసీఆర్‌ అని, కామారెడ్డి పోటీలో వ్యూహం ఉందని.. అందుకే పోటీ చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు అంశంపై బిజెపి, కాంగ్రెస్‌ చిన్నచూపు చూస్తున్నాయని ఎంఎల్‌సి కవిత తెలిపారు. బుధవారం ఆమె విూడియాతో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లు ఇవ్వడంలో బిజెపి`కాంగ్రెస్‌ విఫలమయ్యాయని మండిపడ్డారు. ఇవిఎం ట్యాంపరింగ్‌ జరుగుతున్నట్టు అనుమానాలు ఉన్నాయని, ఎంపి అర్వింద్‌పై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తామని కవిత హెచ్చరించారు. అన్ని రంగాల్లో మహిళలు ముందంజలో
ఉన్నారని కవిత ప్రశంసించారు. హర్యానాలో పదో తరగతి చదివిన వాళ్లే ఎన్నికలలో పోటీ చేయాలని చట్టం తీసుకొచ్చారని, మహిళలు ఎక్కువ చదువుకున్నవారు ఉండరు కావునా ఈ చట్టం తీసుకొచ్చారని దుయ్యబట్టారు. 1996లో అప్పటి ప్రధాని దేవెగౌడ మహిళా రిజర్వేషన్‌ బిల్లు ప్రవేశ పెట్టారని, 2010లో రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లు పాస్‌ చేశారని, 2023వరకు పార్లమెంట్‌ లోని లోక్‌ సభలో ఎందుకు బిల్లు పాస్‌ చేయలేదని కవిత ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లును చట్ట చేస్తేని మహిళకు రక్షణగా ఉంటుందని, మహిళలు రాజకీయంగా ఎదుగుతారని కవిత తెలిపారు. ప్రతీ పార్టీ నుంచి అనేక మంది నాయకులు తనను తూలనాడారని.. వారందరికీ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు. మహిళా బిల్లుపై రియక్ట్‌ కానీ నాయకులంతా టికెట్లపై స్పందించారని, ఇది కేవలం టికెట్ల పంచాయితీ మాత్రమే కాదని, మహిళా బిల్లు తన పర్సనల్‌ విషయం కాదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా పురుషాధిక్యత ఉందని, యూపీలో స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం లేదని, అన్ని రాష్టాల్ల్రో స్థానిక సంస్థల్లో 33 శాతం రిజర్వేషన్‌ అమలు అవుతోందన్నారు. నెహ్రూ కేబినెట్‌లో ఒక్క మహిళా, మోదీ కేబినెట్‌లో కేవలం ఇద్దరు మహిళా మంత్రులు మాత్రమే ఉన్నారని, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలని కవిత ప్రశ్నించారు. ఇది తన ఇంటి సమస్య కాదని, 70 కోట్ల మహిళల సమస్య అని అన్నారు. హర్యానాలో మహిళలకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారనన్నారు. ఇక్కడ కిషన్‌ రెడ్డి విమర్శలు చేస్తున్నారని, రేవంత్‌ రెడ్డి అవహేళనగా మాట్లాడారన్నారు. 2010లో రాజ్యసభలో పాస్‌ అయిన బిల్లు ఇన్నేళ్లు అయినా లోక్‌ సభలో ఎందుకు పాస్‌ కాలేదని, ఇన్నేళ్లు కాంగ్రెస్‌ ఏం చేసిందని కవిత ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి ఏ రోజైనా మోదీని క్రిటిసైజ్‌ చేశారా?.. ఆ రెండు పార్టీలు ఒక్కటే అన్నారు. డిసెంబర్‌లో మళ్లీ ఢల్లీిలో ధర్నా పెడతానని, సోనియా, డికే అరుణకు ఆహ్వానం పంపిస్తానన్నారు. ఎంపి అరవింద్‌ కామెంట్స్‌పై ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు