వరంగల్ : సిఎం కెసిఆర్ రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక తెలంగాణగా మారుస్తున్నారని యదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని పునః నిర్మించి చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకార చుట్టారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల రంగంపేటలో రూ.3 కోట్లతో నిర్మిచిన దేవాదాయ శాఖ సవిూకృత భవన సముదాయన్ని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సర్వే నెంబర్.725 ఓపెన్ ల్యాండ్‌లో సెంట్రల్ జైలు, వరంగల్ ఎదురుగా 1014 చదరపు గజాలలో దేవాదాయ శాఖ కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టారు. నేడు దేవాదాయ శాఖ సవిూకృత భవనాన్ని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. నాలుగు అంతస్తులతో నిర్మించిన ఈ భవనంలో మొదటి అంతస్తులో డిప్యూటీ కమిషనర్, ఎండోమెంట్స్, వరంగల్ జోన్, రెండవ అంతస్తులో అసిస్టెంట్ కమిషనర్, ఎండోమెంట్స్, వరంగల్, మూడవ అంతస్తులో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎండోమెంట్స్, వరంగల్, నాలుగవ అంతస్తులో ఈ.ఓ., శ్రీసమ్మక్క` సారలమ్మ జాతర, మేడారం కార్యాలయాలు ఉంటాయన్నారు. ఇవన్నీ ఒకే చోట ఉండడం వల్ల పరిపాలన సౌలభ్యమే కాక సందర్శకులకు వివిధ పనుల విూద వచ్చే వాళ్లందరికీ ఎంతో సౌకర్యంగా ఉంటుందని పేర్కొన్నారు. గతంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన మన దేవాలయాలు, మన కవులు, కళాకారులకు తెలంగాణ వచ్చాకే..తగిన గౌరవం, గుర్తింపు దక్కింది. నేడు కనీవినీ ఎరుగని రీతిలో దేవాలయాల అభివృద్ధి జరుగుతున్నదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్, జిల్లా కలెక్టర్ సిక్తపట్నాయక్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.