Friday, May 17, 2024

తెలంగాణ పాల పిట్ట కేసీఆర్..

తప్పక చదవండి
  • కితాబిచ్చింది మంత్రి హరీష్ రావు..

హైదరాబాద్ : తెలంగాణ పాల పిట్ట సీఎం కేసీఆర్. తెలంగాణలో కేసీఆర్‌ ఒకవైపు.. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకి ఎక్కుపెట్టిన వ్యక్తులు మరో వైపు ఉన్నారు. తేల్చుకోవాల్సింది ప్రజలేనని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. మంగళవారం సంగారెడ్డిలోని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, డీసీసీబీ వైస్ చైర్మన్ మాణిక్యం నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ విధానాలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు – నోటుకు సీటు అనే వాళ్లు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయని వ్యక్తి తెలంగాణను ఎలా అభివృధి చేస్తారని ప్రశ్నించారు. పార్టీ ఆదేశానికి కట్టుబడి సంగారెడ్డి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి చింతా ప్రభాకర్‌కు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ సారి సంగారెడ్డిలో గులాబీ జెండా ఎగురవేస్తామన్నారు. పార్టీ పట్నం మాణిక్యం, ఆయన అనుచరులను కాపాడుకుంటున్నది. కర్ణాటక రైతులు కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేశామని అక్కడి ప్రభుత్వాన్ని తిడుతున్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవు అని ప్రశ్నించారు.

దేశంలో కరెంటు కోతలు ఉంటే మనం నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ధరణి వద్దు అంటున్నది. ధరణి వద్దు అంటే పటేల్ పట్వారీ వ్యవస్థు తెస్తారా? ధరణిలో లోపాలు ఉంటే సరి చేస్తామని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కంప్యూటర్ మా నాన్న తెచ్చాడు అన్నారు. ఇప్పుడు మేం చేసేంది కంప్యూటరీకరణ. రాష్ట్రం కేసీఆర్‌ చేతిలో ఉంటేనే సుభిక్షంగా ఉంటుందని మంత్రి తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు