Tuesday, May 21, 2024

స్థానికేతరులను ఓట్లతో తరిమి కొట్టండి

తప్పక చదవండి
  • ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
  • కొత్తగా పెళ్లయిన మహిళలకు లక్షలతో పాటు తులం బంగారం.
  • ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇల్లు, ఐదు లక్షల సాయం.
  • సాగుకు 24 గంటల నిరంతర ఉచిత విద్యుత్
  • కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి

జనగామ : పట్టణం 7వవార్డు, 8వవార్డు, 9వ వార్డు లో గడప గడపకు తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరిస్తూ, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి నన్ను గెలిపించాలని జనగామ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నియోజకవర్గ ప్రజలను కోరారు. ఆదివారం జనగామ జిల్లాలో బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నూతన భవనం ప్రారంభించారు. ఈ సందర్బంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ… స్థానికులైన నన్ను మీ ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. స్థానికేతరులను మీ ఓట్లతో తరిమికొట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో ధరణితో పాటు విద్యార్థులు, డీఎస్సీ, ఉద్యోగాల భర్తీ, పీఆర్సీ ప్రకటనతో పాటు జర్నలిస్టులకు సంబంధించిన పలు అంశాలను పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు అవసరమైన అంశాలను ఇందులో పొందుపరిచామని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి… అధికారం ఇవ్వాలని కోరారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలను అమలు చేయటంతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన విషయాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. దళిత, గిరిజనులకు మేలు చేసేలా మేనిఫెస్టో ఉందన్నారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచేలా ఉందని చెప్పారు. పేదలకు భూములపై హక్కులు కల్పించేలా పలు అంశాలను పేర్కొన్నారు తెలిపారు.ఈ మేనిఫెస్టోను ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పిసిసి మెంబర్ చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జనగామ మున్సిపల్ మాజీ చైర్మన్ వేమళ్ళ సత్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, జనగామ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కంచ రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చరాబుడ్ల దయాకర్ రెడ్డి, వడ్లకొండ పీఏసీఎస్ డైరెక్టర్ వంగాల మల్లారెడ్డి, మేడ శ్రీనివాస్, 9వ వార్డు కౌన్సిలర్ ముస్త్యాల చందర్, మైనార్టీ సెల్ రాష్ట్ర నాయకులు జామాల్ షరీఫ్, యం.డి గౌస్, తోట సత్యం, యం.డి ముజ్జు, తాటి కనుక స్వామి, 9వ వార్డు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మునిబేగం , కడారు ప్రవీణ్, దిలీప్, మంజుల, చేనోజు విజయ లక్ష్మి, గందమల్ల కమలాకర్, మోతే జనార్దన్, పాముకుంట్ల మణిదిప్, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు