Friday, May 3, 2024

తుఫాను బాధిత రైతులను గాలికొదిలేశారు : కేశినేని నాని

తప్పక చదవండి

విజయవాడ : మిచౌంగ్‌ తుపాను రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అన్ని పంటలతో పాటు పూత విూద మామిడి కూడా దెబ్బ తిన్నదన్నారు. కొన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తిని వరి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరానికి 40 నుంచి 50 వేల ఎకరాలు నష్టపోయారన్నారు. రైతులను ఆదుకోవడంలో జగన్‌ సర్కార్‌ పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. హుద్‌ హుద్‌ తుఫాన్‌ సమయంలో చంద్రబాబు అక్కడే ఉండి ప్రజలకు ధైర్యం ఇచ్చారని కేశినేని నాని గుర్తు చేశారు. చాలా నిర్లక్ష్యంగా రైతులను గాలికొదిలేసిందన్నారు. ఇటువంటి ప్రభుత్వం ఉండడానికి వీల్లేదన్నారు. కేంద్రంలో ఆదుకోమని టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో డిమాండ్‌ చేశారన్నారు. ముందుగా 5 వేల కోట్లు విడుదల చేయాలని టీడీపీ ఎంపీలు కోరారని కేశినేని నాని తెలిపారు. కేంద్ర మంత్రిని రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరామన్నారు. రైతులను చంద్రబాబు ఆదుకుంటామని స్పష్టమైన హావిూ ఇచ్చారన్నారు. ఢల్లీి నుంచి గల్లీ దాకా తమ ప్రయత్నాలు తాము చేసి రైతులను ఆదుకుంటామన్నారు. విజయవాడ శివారులో తాగు నీటి సమస్య ఉందన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం మండలంలో ప్రతి గ్రామానికి నీటి ట్యాంకర్ల పంపిణీ చేశామన్నారు. ఇప్పటిదాకా 120 న్యూటి ట్యాంకర్ల ఇచ్చామని.. ఇంకా నీటి ఎద్దడి ఉన్న గ్రామాలకు ఇస్తామన్నారు. 13 కోట్లు తాగు నీటి సమస్య పరిష్కారానికి ఖర్చు చేస్తున్నామన్నారు. ఏ ఎంపీ చేయనటువంటి కార్యక్రమం చేయడం తన అదృష్టమని.. చంద్రబాబు, ఎన్టీఆర్‌ స్ఫూర్తితో ముందుకు వెళతామని కేశినేని నాని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు