Saturday, July 27, 2024

కష్టపడి పనిచేస్తున్న శ్రీనివాస్ గౌడ్ ను గెలిపించండి…

తప్పక చదవండి
  • మాజీ మంత్రి పి చంద్రశేఖర్

మహబూబ్ నగర్ : ఇప్పటికే రెండు పర్యాయాలు ఎంతో కష్టపడి మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేసిన మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి పి చంద్రశేఖర్ ప్రజలను కోరారు. నిరంతరం ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఇలాంటి నాయకున్ని గెలిపించే బాధ్యత జనంపై ఉందన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాత పాలమూరులో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన తర్వాత రోడ్ షో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీమంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ… ప్రతిపక్షాలు జాతరలో వెలసే అంగడి లాంటి వారని… ఓట్ల జాతర అయిపోగానే ఆ జాతరలోని దుకాణాలను ఎత్తేస్తారని అందుకే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో 100 మందికి పైగా ఎమ్మెల్యేలను అందించి కేసీఆర్ కి మనం బలం ఇవ్వాలని కోరారు. గతంలో తాను, కేసీఆర్ కలిసి పనిచేశామని ఆయన ఆలోచనలన్నీ అభివృద్ధి పైనే ఉండేవన్నారు. అప్పటి వరకు రూ.200 ఉన్న పింఛన్ ను ఒక్కసారిగా రూ.2016 అవుతుందని అసలు ఎవరూ ఊహించనే లేదన్నారు. ఇప్పుడు కెసిఆర్ హామీ ఇచ్చిన మేరకు రూ.5016 పింఛన్ కూడా వస్తుందన్నారు. మాయమాటలు నమ్మవద్దని, మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు.


కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, సింగిల్ విండో చైర్మన్ రాజేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాసులు, నాయకులు నవకాంత్ మాల్యాద్రి శ్యామ్ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నేను పాత పాలమూరు వాణ్ణే.. నాకు కష్ట సుఖాలన్ని తెలుసు : వి శ్రీనివాస్ గౌడ్

తన బాల్యమంతా పాతపాలమూరులోనే సాగిందని… ఇక్కడి ప్రజల కష్ట సుఖాలన్నీ తనకు తెలుసని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పాత పాలమూరులో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ జీవించారని, కనీసం తాగునీరు మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడ్డారని గుర్తు చేసుకున్నారు. తాను ఎమ్మెల్యే, మంత్రి అయిన తర్వాత తమ మధ్య తిరిగిన వ్యక్తి మంచి స్థానానికి చేరుకున్నాడని… తమకు అండగా ఉంటారని స్థానికులు భావించారన్నారు. వారి నమ్మకం వమ్ము చేయకుండా ఈ ప్రాంతంలోని పేదలకు అనేకమందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి ఇచ్చామన్నారు. అనేకమంది వృద్దులు దివ్యాంగులకు ఆసరా పింఛన్లు ఇప్పించామన్నారు. ఒక్క పాత పాలమూరులోనే రూ.12.14 కోట్ల ఆసరా పింఛన్లను అందిస్తున్నామని తెలిపారు. గతంలో ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని… కానీ దాము అధికారంలోకి వచ్చిన తర్వాత 59 మందికి కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ఒక్కొక్కరికి లక్ష రూపాయల సాయం అందించామన్నారు. మీ ప్రాంతంలో పెరిగిన బిడ్డను భారీ మెజారిటీతో గెలిపిస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు అవకాశం ఉందని మంత్రి విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు