Saturday, May 4, 2024

ఫికర్ మత్ కరో..

తప్పక చదవండి
  • ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం
  • టీపీసీసీ సమావేశంలో సీఎం రేవం త్‌ కీలక నిర్ణయాలు
  • తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని ఏకగ్రీవ తీర్మా నం
  • ఓడిపోయిన బీఆర్ఎస్ తన వైఖరి మార్చుకోలేదని ఎద్దేవా
  • పని చేసిన ప్రతీ కార్యకర్తకు కాంగ్రెస్ అవకాశం కలిపిస్తోంది
  • పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపు

హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిం చిన తర్వా త తొలిసారిగా పీసీసీ విస్తృ తస్థాయి సమావేశం నిర్వ హించారు.బుధవారం గాం ధీ భవన్లో పీసీసీ అధ్య క్షుడు, ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి అధ్య క్షతన జరిగిన ఈ సమావేశంలో నూతనంగా నియమితులైన ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్ మున్షి తో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, పలువురు మంత్రులు, ప్రదేశ్ ఎన్నికల రాజకీయ వ్య వహారాల కమిటీల సభ్యు లు, డీసీసీ అధ్య క్షులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్య క్షులు, అధికార ప్రతినిధులు పాల్గొన్నా రు. ఈ సమావేశంలో సీఎం రేవం త్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు. ప్రతి జిల్లాలో పార్టీ కార్యా లయాలకు ఎకరం స్థలం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల అనంతరం నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆరు గ్యారంటీల అమలుకు త్వరలో గ్రామాల్లో కమిటీలను ఏర్పా టు చేయనున్నట్లు తెలిపారు . జోనల్ వ్య వస్థను సమీక్షిం చేందుకు ఇదిరమ్మ కమిటీ ఏర్పా టు చేయనున్నామని .. . ఎస్సీ కమిషన్ రద్దు చేసి, త్వరలో కొత్త కమిషన్ నియమించనున్నట్లు సీఎం తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన
కార్యవర్గ భేటీలో పార్టీ నేతలు 3 తీర్మా నాలు ప్రవేశపెట్టారు. జనవరి 8,9 తేదీల్లొ పార్లమెం ట్ ఎన్ని కలపై ఉమ్మడి జిల్లా నేతలతో సీఎం రేవం త్ చర్చించనున్నా రు. 11,12,13 తేదీల్లొ పార్లమెం ట్ నియోజకవర్గ ఇం చార్జ్ మం త్రులు, నేతలతో ఎన్నికలపై సమావేశం కానున్నా రు. అనం తరం ముఖ్య మం త్రి 14వ తేదీ నుం చి 4 రోజుల పాటు దావోస్ పర్యటనకు వెళ్లనున్నా రు. సీఎం తోపాటు మం త్రి శ్రీధర్ బాబు కూడా వెళ్లనున్నా రు.అయితే ఈ పర్య టన అనంతరం పార్లమెం ట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేపట్టనున్నట్లు సీఎం రేవం త్ పేర్కొన్నారు. రాబోయే లోక్ సభ ఎన్ని కల్లోతెలం గాణ నుం చి సోనియా గాం ధీ పోటీ చేయాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మా నం చేసినట్లు ముఖ్య మం త్రి రేవం త్ రెడ్డి పేర్కొన్నారు .

- Advertisement -

ఆరు గ్యా రంటీలను అమలు చేసి తీరుతాం
వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారిని గుర్తిం చి.. వారికి సముచిత స్థానం కల్పించే బాధ్య త తమదని సీఎం రేవంత్ స్పష్టం చేశారు . బోర్లపడి బొక్క లు విరిగినా బీఆర్ఎస్కు బుద్ది రాలేదని విమర్శిం చారు. నెల రోజులు గడవకముం దే కాం గ్రెస్ హామీలపై పుస్తకాలు విడుదల చేస్తున్నా రని మం డిపడ్డారు.చెరుకు తోటల్లోపడిన అడవి పందుల్లా తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుం దని ధ్వ జమెత్తారు రేవం త్. బీఆర్ఎస్ విమర్శ లను ధీటుగా తిప్పి కొట్టాలని పార్టీ నేతలకు సూచించారు. టార్గెట్ 17 పెట్టుకుని లోక్సభ ఎన్ని కల్లోపనిచేయాలని సూచించారు ..12కు తగ్గకుం డా సీట్లను గెలిపిం చుకోవాలని తెలిపారు. ఈ నెల 8న 5 జిల్లాలు.. 9న 5 జిల్లాల నేతలతో సమీక్షిం చనున్నట్లు చెప్పా రు . 20 తరువాత క్షేత్ర స్థాయి పర్య టనల్లోపాల్గొం టానని తెలిపారు.‘బీజేపీ అధ్య క్షుడు కిషన్ రెడ్డికి ఆదాయం తగ్గినట్టుందని . అం దుకే కిషన్ రెడ్డి కాళేశ్వ రం పై సీబీఐ ఎం క్వ యిరీ కోరుతున్నా రని అన్నారు . ఆనాడు స్వ యం గా నేను సీబీఐ ఎం క్వ యిరీ కోరినపుడు ఏం చేశారని ప్రశ్నించారు. దొం గను గజదొం గకు పట్టిం చాలని కిషన్ రెడ్డి అడుగుతున్నా డని అన్నారు . కాళేశ్వ రం అవినీతిపై మేం జ్యు డీషియల్ విచారణ చేసి తీరుతాం అని అన్నారు . బీజేపీ,బీఆర్ఎస్ తోడు దొం గలని . ఇద్దరూ కలిసే కాళేశ్వ రం పేరుతో దోచుకున్నా రని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతలకు అన్యా యం చేశారని రేవం త్ మం డిపడ్డారు.

డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దశాబ్ద కాలం తర్వా త మనకు ప్రజలు ఇచ్చిన గొప్ప అవకాశమని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. అనేక కష్టనష్టాలను భరించి అధికారంలోకి వచ్చామన్నారు. యువత ఎన్నో కలలు కని తెలంగాణ కోసం పోరాటం చేశారని చెప్పా రు. ప్రజలకు మనం ఇచ్చి న హామీలపై విశ్వా సం తో కాం గ్రెస్ను గెలిపించారన్నారు. కాంగ్రెస్ పార్టీ పక్షాన పని చేస్తున్న వారంతా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలని పిలుపునిచ్చా రు.గత ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వం తో రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారని భట్టి మండిపడ్డారు. ఒకవైపు రాష్ట్రం ఆర్థికం గా బలోపేతం కావాలని, మరోవైపు ప్రజలకు ఇచ్చి న హామీలను అమలు చేయాలని తెలిపారు. రాష్ట్రం లో స్వా తం త్రం వచ్చి నట్టు ప్రజలు ఫీల్ అవుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తిం పు ఇస్తామన్నా రు. ఇతర మం త్రులు మాట్లాడుతూ.. లోక్సభ ఎన్ని కల తర్వా త బీఆర్ఎస్ కనుమరుగవుతుం దని జోస్యం చెప్పా రు. తలతాకట్టు పెట్టైనా 6 గ్యా రం టీలు అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు..

దీపాదాస్ మున్షి ఏఐసీసీ ఇంచార్జ్ మాట్లాడుతూ .. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడానికి కార్యకర్తలు పదేళ్లు కష్టపడ్డారని ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి అన్నారు. తెలంగాణ ప్రజల సుదీర్ఘ ఆకాంక్షలను మనం నెరవేర్చాలని అన్నారు. సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా మనం తెలంగాణ ఇస్తూ నిర్ణయం తీస్కున్నామని ప్రజలు మనకు ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇచ్చారని ప్రతీ నాయకుడు నిబ్బద్దతతో పనిచేయాలని సూచించారు . పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ నాయకులు మరింత శ్రమించి పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషిచేయాలని సూచించారు. తెలంగాణలోని హైదరాబాద్ లో బోగస్ ఓట్లు చాలా ఉన్నాయని.. నాయకులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీస్కొని పని చేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ లో మరింత టీమ్ వర్క్ జరగాలని పేర్కొన్నారు. మనకు ముందు చాల ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆరు గ్యారంటీలు అమలు తో ప్రజల్లో సంతోషం వ్యక్తం అవుతుంది. ప్రభుత్వం.. పార్టీ సమన్వయం తో కలిసి పనిచేస్తే మరింత మంచి ఫలితాలు వస్తాయని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిమాట్లాడుతూ .. పార్టీ కోసం ఎంతో మంది కార్యకర్తలు, నాయకులు శ్రమించారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వారి త్యాగాల ఫలితంగానే కాంగ్రెస్ అధీకారంలోకి వచ్చిందని అన్నారు. వారి కష్టానికి తగిన ఫలితం ఉంటుందని హామీ ఇచ్చారు. మరో కొన్ని నెలలు కష్టపడి పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు తేవాలని కోరారు . ఇప్పటికే బలహీనమైన బిఆర్ఎస్ జాతీయ స్థాయి ఎన్నికల్లో మరింత బలహీనంగా ఉంటుందని నాయకులు సమీష్టిగా పనిచేసి పార్ట్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయలని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు