- అభివృద్ధి పరుగులు పెడుతున్న కొత్తగూడెం
కొత్తగూడెం : సింగరేణి సిగలో విరజిమ్మిన సెగలు తెలంగాణ ఉద్యమ వేడిని పెంచాయి. తొడలు విరిచి గనులు తొలిచే కార్మికులంతా ముక్తకంఠంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ఎలుగెత్తి చాటారు. తెలంగాణ ఏర్పాటయ్యాక బొగ్గుబాయిలో యేటా సంబురాలే. యేటికేడూ రెట్టించిన బోనసులే! కొత్తగూడెం పరిధిలోని సింగరేణితోపాటు నియోజకవర్గంలోని పల్లెలన్నీ అభివృద్ధితోపాటు సంక్షేమాన్నీ బోనస్‌గా అందుకుంటున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గం 1978లో ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా 2014లో టీఆర్‌ఎస్ గులాబీ జెండా ఎగిరింది. కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా జలగం వెంకటరావు విజయఢంకా మోగించి చరిత్రను తిరగరాశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన వనమా వెంకటేశ్వరరావు, అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుపై విజయం సాధించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధిని చూసి వనమా వెంకటేశ్వరరావు టీఆర్‌ఎస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నాలుగేండ్లలో నియోజకవర్గ రూపురేఖలు మార్చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం కొత్త కలెక్టరేట్ భవనాన్ని నిర్మించింది. ముర్రేడు వాగు రిటెయినింగ్ వాల్‌కు రూ.36 కోట్ల నిధులు మంజూరు చేయించారు. పాల్వంచ దవాఖానను 50 నుంచి 100 పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. రూ. 3 వేల కోట్లతో రహదారులు, డ్రెయిన్‌లు, చెక్‌డ్యాంలు, సెంట్రల్ లైటింగ్, మున్సిపాలిటీల్లో డివైడర్లు నిర్మిం చారు. కొత్త గ్రామపంచాయతీలకు భవనాలతో పాటు మున్సిపల్ పరిధిలో పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. 2018 నుంచి ఇప్పటి వరకు 55 మంది రైతులు మృతి చెందగా వారి కుటుంబాలకు రూ. 25.25 కోట్లు పరిహారాన్ని అందజేశారు. రైతువేదికలు, పల్లెప్రకృతి వనాలు, కొత్త జీపీ భవనాలు, శ్మశానవాటికలు, డంపింగ్ యార్డులు, పంట కల్లాలను అందుబాటులోకి తెచ్చారు. కొత్త మండలాలకు కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. చరిత్రలో నిలిచి పోయేలా 55 వేల మంది పోడు రైతులకు పట్టాలు ఇచ్చారు.ప్రభుత్వం జిల్లాకు మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీని మంజూరు చేసింది. కొత్తగూడెం ఏరియా దవాఖానను జిల్లా ఆసుపత్రిగా మార్చింది. రామవరంలో వందపడకలతో మాతాశిశు ఆరోగ్య కేంద్రా న్ని ఏర్పాటు చేసింది. కొత్తగూడెంలో డయాలసిస్ కేంద్రాన్ని నెలకొల్పడంతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఊరటనిస్తున్నది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వనమా వెంకటేశ్వరరావు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మూడు మండలాలజడ్పీటీసీలు, నాలుగు మండలాల ఎంపీపీలు, సర్పంచ్‌లు, జడ్పీ చైర్మన్ కూడా బీఆర్‌ఎస్ వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అభివృద్ధిని చూసి కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. దీంతో బీఆర్‌ఎస్ గ్రాఫ్ భారీ గా పెరిగిపోయింది. నల్లనేలపై మరోమారు గులాబీ జెండా రెపరెపలాడనున్నది.