Tuesday, May 21, 2024

భవిష్యత్‌ పౌరులను తీర్చిదిద్దే ప్రయోగశాలలే పాఠశాలలు

తప్పక చదవండి

భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర సమర యోధులు, విద్యావేత్త, తత్వవేత్త, మైనారిటీ నాయకుడు మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో విద్యా వ్యాప్తికి ఎనలేని కృషి చేసిన గుర్తింపుగా మౌలానా జన్మది నం సందర్భంగా నవంబర్‌ 11న జాతీయ విద్యా దినోత్సవం గా భారత ప్రభుత్వం 2008 లో ప్రక టన చేసింది. ఆయన 1947 నుండి 1958 వరకు విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. మౌలానా ఒక సంఘసంస్కర్త, విద్య ద్వారానే దేశాన్ని నిర్మించడానికి కట్టు బడి ఉన్న నాయకుడు. మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌, మౌలానా సయ్యద్‌ అబుల్‌ కలాం గులాం ముహి యుద్దీన్‌ అహ్మద్‌ బిన్‌ ఖైరుద్దేన్‌ అల్‌ హుస్సేన్‌.ఆజాద్‌ అనే పేర్లతో పిలుస్తారు. నవంబర్‌ 11,1808లో జన్మించాడు. 11 సంవత్స రాల వయస్సులో తల్లి మరణం తీరని లోటు.తన 13 వ ఏట యువ జులేఖా బేగం తో వివాహం అయింది. అబుల్‌ కలాం గొప్ప పండితుడు, జర్నలిస్టు, భారత దేశానికి ఆయన చేసిన అతి పెద్ద సహకారం విద్య బహుమతి. అందుకే 19 20 లో ఉత్తర ప్రదేశ్‌ లోని అలీగడ్‌ జామియా మిలియా ఇస్లాం మిక్‌ ఫౌండేషన్‌ కమిటీకి సభ్యుడిగా ఎన్నికైనాడు. అతి చిన్న వయసు 30 సంవత్స రాల కే భారత జాతీయ కాంగ్రెస్‌ కు 1940 నుండి 1945 మధ్య కాలంలో అధ్యక్షుడైనాడు. ప్రారంభంలో తన తండ్రి తనకు గురువు. ఉర్దూలో అనేక కవితలు రాశాడు. 1912లో మౌలానా ముస్లింలలో దేశభక్తిని పెంపొందించుటకు,బ్రిటిష్‌ ప్రభుత్వ విధానాలపై దాడి చేయుటకు మౌలానా ‘‘ఆల్‌- హిలాల్‌ ‘‘అనే ఉర్దూ వార పత్రికలు ప్రారంభించాడు. ఆధునిక ఐఐటిలు మౌలానా అబ్దుల్‌ కలాం ఆలోచనలే, 1951లో భారతదేశంలోని మొట్టమొదటి ఐఐటి (ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ) ఖరగ్‌పూర్‌లో స్థాపించాడు. ఢల్లీిలోని సెంట్రల్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌, 1934లో యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ ఏర్పాటుకు ఆయనే బాధ్యత వహించాడు. బెంగళూరులో ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సి) ఏర్పాటుకు కృషి చేసాడు.వీటి ఏర్పాటు భారతదేశం సాంకేతిక విద్య మరియు పరిశోధన పురోగతిలో మైలురాయిగా చెప్పవచ్చును 1948 జనవరి 16న, ఒక సందర్భంలో ఆయన మాట్లాడుతూ, మనం ఒక్క క్షణం కూడా మర్చిపోకూడదు, కనీసం ప్రాథమిక విద్యను పొందడం ప్రతి వ్యక్తి జన్మహక్కు, అది లేకుండా పౌరుడిగా తమ విధులను నిర్వర్తించలే డు అన్నాడు. దేశాభివృద్ధిలో విద్య పోషించే ప్రాధమిక పాత్ర అని అన్నారు. అంతేకాకుండా సెంట్రల్‌ అడ్వైజరీ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ గా మౌలానా అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ వయోజన విద్య, అక్షరాస్యతకు ఉత్సాహం ఇచ్చాడు. అలాగే విద్య మరియు సంస్కృతిని ప్రోత్సహించుటకు సంగీత నాటక అకాడమీ ని 1953 లో స్థాపించాడు, 1954 లో లలిత కళా అకాడమీని స్థాపించాడు. స్కూల్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ ను స్థాపించిన ఆయన 14 సంవత్సరాల వయసు వరకు పిల్లలందరికీ ఉచిత మరియు తప్పనిసరి విద్య బాలబాలి కలకు అవసరమ ని చాటి చెప్పాడు. మైనారిటీ విద్య బలోపేతానికి విద్యార్థులకు సహాయం రూపంలో అందించుటకు ఫెలోషిప్‌లను ప్రవేశపెట్టాడు. భవిష్యత్తు పౌరులను ఉత్పత్తి చేసే ప్రయోగశాలలే’’ పాఠశాలులిలిఅన్న ఆయన దేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కు వన్నె తెచ్చాడు. ఆయన మరణానంతరం 1992లో భారతదేశ అత్యున్నత పురస్కా రమైన ‘భారతరత్న బిరుదు ఇవ్వడం జరిగింది. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా నవంబర్‌ 11న పాఠశాల లు, కళాశాలల్లో వ్యాస రచన,ర్యాలీలు ,ఉపన్యాస పోటీలు, సెమినార్లు ,నిర్వహిస్తూ ,స్వతంత్ర భారతంలో విద్యావ్యాప్తికి చేసిన కృషిని స్మరించుకుం దాం. మా రుతున్న కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.విద్యాశాఖ మంత్రిగా మౌలానా అన్నట్లుగా విద్య పోషించే స్థాయిలో ఉండాలంటే విద్యారంగం మొత్తం ప్రభుత్వ ఆధీనంలో నే ఉండాలి.విద్య సామాన్యునికి బారం కాకుండా ఉన్నప్పుడే దేశాబి వృద్ధిలో విద్య ప్రముఖ పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చును.
` కామిడి సతీష్‌ రెడ్డి 9848445134

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు