Tuesday, May 21, 2024

“దిగంబర్ జైన” మతస్తుల దాడి నుండి గిరినార్స్వయంభూ దత్త క్షేత్రాన్ని కాపాడండి..

తప్పక చదవండి
  • విజ్ఞప్తి చేసిన కైలాష్ పురోహిత్, గుజరాత్.
  • గురు దత్తాత్రేయ స్వామి స్వయంభు పాద చరణాలపై
    కుర్చీలు విసిరేసి ధ్వంసం చేసే ప్రయత్నం.
  • ఆలయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్
  • ఇకనైనా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని వినమ్ర వినతి.
  • ప్రపంచంలోని ప్రతి హిందువు ఈ విషయాన్ని తీవ్రంగా
    పరిగణించాలని ప్రార్థిస్తున్న ఆలయ ట్రస్ట్.
  • భారతదేశంలోని ప్రతి దత్త భక్తులు తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో
    సుధీర్ సోహన్లాల్ భజ్ (జైన్) అనే వ్యక్తిపై ఫిర్యాదు నమోదు చేయాలని పిలుపు.
  • మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర నుండి దాదాపు 250 పైగా
    దిగంబర జైన మతస్తులు ఆలయం పై విరుచుకుపడ్డారు.

హైదరాబాద్ : నాలుగు యుగాలుగా వెలుగొందుతున్న సుప్ర”సిద్ధ శ్రీ క్షేత్రం” గుజరాత్ జునాగఢ్ ప్రాంతంలో ఉన్న గిరినార్ పర్వతం. 9999 మెట్లు ఎక్కిన తర్వాత దర్శనమిస్తాయి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి నిజపాద చరణాలు. స్వామివారి 4 ప్రధాన క్షేత్రాలు కర్ణాటక లోని గాణుగాపురం, కురువాపురం, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురం, ఎత్తిపోతల కాగా, 5వ ప్రధాన సిద్ద క్షేత్రం గుజరాత్ రాష్ట్రం జునాగడ్ ప్రాంతం లోని గిరినార్ పర్వతం. ఈ క్షేత్రం ఆది నుండి హిందువులదైనప్పటికీ, జైన మతంలోని దిగంబర వర్గానికి చెందినవారు ఈ ఆలయం తమ మతస్తులకు చెందినదని వాపోతుంటారు. వందల సంవత్సరాలుగా వారి నుండి ఈ బాధ ఎదురవుతున్నప్పటికీ, కాలక్రమేణా వారి యొక్క అసాంఘిక చర్యలు ప్రతి సంవత్సరం ఎక్కువ అవుతూ వస్తున్నది అని చెప్పుకోవడానికి చాలా బాధ వేస్తున్నది. ఇది హిందూ క్షేత్రం అనడానికి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ నుండి సాక్షాధారాలు కూడా ఉన్నాయి. ఈ విషయంపై కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ 2006వ సంవత్సరం తర్వాత ఎటువంటి హియరింగ్ ఇంకా జరగలేదు. రాను రాను పెట్రేగిపోతున్న ఈ దిగంబర్ జైన వర్ణం వారి ఆగడాల నుండి గిరినార్ పర్వతంపై వెలసిన శ్రీ గురు దత్తాత్రేయ స్వామి నిజపాద చరణ ఆలయాన్ని కాపాడాల్సిన బాధ్యత, అవసరం గుజరాత్ రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలపై ఉన్నదని మనవి చేస్తున్నాము. ఆలయ ట్రస్టీగా, క్షేత్ర పురోహితులుగా మేము ఏ ఒక్క భక్తుడిని స్వామి దర్శనం నుండి ఆపలేము. దీన్నే ఆసరాగా చేసుకొని మూర్ఖులు ఆలయంలోకి ప్రవేశించి దాడి చేస్తున్నారు.

అక్టోబర్ 1వ తేదీ నాడు ఉదయం 9 గంటల నుండి 12 గంటల మధ్య మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ కి చెందిన దాదాపు 250 కి పైగా దిగంబర జైన మతస్తులు ఆలయంలోకి ప్రవేశించి అఘోర తప్పస్సులో జీవితం గడుపుతున్న సాధు సన్యాసులపై దాడి చేసి, కుర్చీలు వగైరా విసిరేసి స్వామి వారి దివ్య మంగళ స్వరూప విగ్రహాన్ని, వారి యొక్క స్వయంభు నిజ పాద చరణాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి వార్త వినడానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేయడమే కాకుండా మాలోని నిగ్రహాన్ని కూడా హద్దులు దాటింపజేస్తుంది. ఈ పర్వతాలపై నెలకొని ఉన్న జైన మందిరాలకు మాత్రం మేము ఎలాగూ వెళ్ళము. కానీ వాళ్లు మాత్రం ఇలా చేస్తున్నారు. కావున భారతదేశంలోని ప్రతి దత్త భక్తునికి మేము ఇచ్చే పిలుపు ఒకటే. ఈ దుష్కార్యానికి సారధి అయినటువంటి సుధీర్ సోహన్లాల్ అనే వ్యక్తిపై తమ తమ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఇతనికి విరుద్ధంగా కేసు నమోదు చేయండి. వివరాలు కింద ఇస్తున్నాము. దయచేసి ఈ ఈ విషయాన్ని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి దత్త భక్తునికి, ప్రతి హిందువుకి చేరవేసే ప్రయత్నం చేయండి. కానిపక్షంలో ఈ ముఠా ఎప్పుడైనా ఏమైనా చేయొచ్చు. జరుగుతున్న పరిణామాలపై ప్రతి సాధువు, ప్రతి భక్తుడు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. పోలీసు పహారా పెట్టినప్పటికీ ఇలాంటివి జరుగుతుండడం వలన దయచేసి ప్రభుత్వాలు ఇకనైనా చొరవ చూపి శాంతి భద్రతలకు, వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని వినమ్రతతో విజ్ఞప్తి చేస్తున్నాము. కోట్ల హృదయాల ఇష్టదైవమైనటువంటి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి ఆలయాన్ని కాపాడడంలో తమ వంతు పాత్ర పోషించే అవసరం ఎంతైనా ఉన్నదని దయచేసి గుర్తించండి. జై గిరినారి, జై శ్రీపాద శ్రీ వల్లభ, జై గురుదత్త. సర్వేజనా సుఖినోభవంతు.

- Advertisement -

మన మందరం మన బాధ్యతగా, మీ మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో ఇవ్వవలసిన కంప్లైంట్ కి సంబంధించిన వివరాలు :
సుధీర్ సోహన్లాల్ బజ్ (జైన్), శ్రీ సకల్ దిగంబర్ జైన్ సదార్మీ సహయోగ్ ప్రటిష్తాన్, సర్వే నంబర్ 214/149, భజ్ కాంపౌండ్, యేఒల రోడ్, కోపర్గాన్, మహారాష్ట్ర 423601.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు