Monday, May 6, 2024

కన్నింగ్ సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్..

తప్పక చదవండి
  • ప్రభుత్వ భూమిలో వెంచర్ వేసి అమాయకులకు అంటగడుతున్న వైనం..
  • రూ. 10 వేలనుండి రూ. 3 లక్షల వరకు వసూళ్లు..
  • అడిగితే రాజకీయ కక్షతోనే తనపై ఆరోపణాలంటూ కొత్త కథ..
  • సర్పంచ్ ఆధ్వర్యంలో అక్రమ వెంచర్ జరిగిందని నిర్ధారించిన హెచ్.ఎం.డీ.ఏ.
  • అక్రమ లే అవుట్ పై చర్యలు తీసుకోవాలని తోల్ కట్ట
    గ్రామ కార్యనిర్వాహణాధికారి ఆదేశాలు..
  • అక్రమ లే అవుట్ పై గ్రామ కార్యదర్శి ఫిర్యాదు మేరకు చర్యలు
    తీసుకుంటున్న రెవెన్యూ అధికారులు..
  • సుమారు 700 ప్లాట్లు చేసి అడ్డగోలుగా అమ్ముకున్న సర్పంచ్ శ్రీనివాస్..
  • ఇది వరకే కథనం ప్రచురించిన ఆదాబ్ హైదరాబాద్..
  • జిల్లా కలెక్టర్ సైతం దృష్టి సారించి ప్రభుత్వ భూమిని రక్షించాలని,
    సదరు సర్పంచ్ ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్న స్థానికులు..

హైదరాబాద్ : అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఒకసారి సస్పెండ్ అయినా ఇతగాడి బుద్ధి మారలేదు.. తాను ఒక గ్రామ సర్పంచ్ అనే ఇంగిత జ్ఞానం లేకుండా.. గ్రామ ప్రధమ పురుడు అనే పదానికి మచ్చ తెస్తున్న ఒక అవినీతి సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.. పోయినసారి 5 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు లే అవుట్ కోసం అనుమతులు ఇచ్చిన వ్యవహారం వెలుగులోకి తీసుకుని వచ్చింది ఆదాబ్.. ఇప్పుడు తన బుద్ధి మార్చుకోకుండా ఏకంగా 19 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమికి ఎసరుపెట్టిన వ్యవహారం మీ ముందుకు తీసుకుని వస్తున్నాం..

రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, తోల్ కట్ట గ్రామం. సర్వే నెంబర్ 137, 138, 139, 140. లలో సుమారు 19 ఎకరాల పైచిలుకు ప్రభుత్వ భూమి కల దు.. ఈ భూమిలో గ్రామ సర్పంచ్ కనక మామిడి శ్రీనివాస్ అక్రమంగా వెంచర్ చేస్తున్నాడని ఆగ్రామానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తి.. 23 మే 2023 న హెచ్.ఎం.డీ.ఏ. అధికారులకు ఫిర్యాదు చేశాడు. కాగా ఆ ఫిర్యాదుపై స్పందించిన హెచ్.ఎం.డీ.ఏ. ప్లానింగ్ ఆఫీసర్ సంబంధిత అక్రమ్ లే అవుట్ పై చర్యలు తీసుకోవాలని, తోల్ కట్ట గ్రామ పంచాయితీ, మొయినాబాద్ కార్యనిర్వాహణాధికారికి, జిల్లా కలెక్టర్ కు లెటర్ రాయడం జరిగింది.. హెచ్.ఎం.డీ.ఏ. అధికారులు రాసిన లెటర్ కి స్పందించిన జిల్లా పంచాయితీ రాజ్ అధికారి.. ఆ అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకుని, రిపోర్ట్ సబ్మిట్ చేయాలని, 8 సెప్టెంబర్ నాడు గ్రామ కార్యదర్శికి లెటర్ రాయడం జరిగింది. అలాగే మొయినాబాద్ ఎంపీఓ కు కూడా తెలపడం జరిగింది.

- Advertisement -

కాగా ఈ అక్రమ వెంచర్ లో 120 గజాల చొప్పున సుమారు 700 ప్లాట్లు చేయడం జరిగిందని.. రూ. 10,000 నుండి రూ. 3 లక్షల వరకు వసూలు చేసి అక్రమంగా పేదవారికి అంటగట్టినట్లు తెలిసింది. ప్రభుత్వ భూమిలో లే అవుట్ చేస్తున్న సర్పంచ్ వ్యవహారంపై తోల్ కట్ట గ్రామ కార్యదర్శిని వివరణ కోరగా.. ఇక్కడ ప్రభుత్వ భూమిలో సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ అక్రమ వెంచర్ వేస్తున్న విషయం వాస్తవమే అని, ఇదే విషయాన్ని తెలుపుతూ ఎమ్మార్వో కు లెటర్ రాయడం జరిగిందని తెలిపారు.. కాగా ఆయన ఆదేశాల మేరకు కూల్చివేతలు కూడా చేపట్టడం జరిగిందని తెలిపారు..

ఇదే విషయమై సర్పంచ్ శ్రీనివాస్ ని ఆదాబ్ వివరణ కోరగా ఆయన స్పందిస్తూ.. తనమీద రాజకీయ కక్షతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నారని, అక్రమ లే అవుట్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.. కానీ క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వ్యవహారం పరిశీలించగా జరుగుతున్న అక్రమ లే అవుట్ వాస్తవమని తేలింది.. కనుక ఉన్నతాధికారులు స్పందించి, అమాయకులైన పేదవారి నుంచి అక్రమంగా వసూలు చేసిన డబ్భులు తిరిగి ఇప్పించి.. సదరు సర్పంచ్ పై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమిని రక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.. మరిన్ని వాస్తవాలతో, సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ దోపిడీ పర్వాలను మరో కథనం ద్వారా మీముందుకు రానుంది ‘ఆదాబ్ హైదరాబాద్’, ‘మా అక్షరం అవినీతిపై అస్త్రం’..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు