Friday, May 17, 2024

ఒక వందరోజులు ఓపిక పట్టండి..

తప్పక చదవండి
  • గ్రూప్ వన్ అభ్యర్థులకు అభయమిచ్చిన రేవంత్ రెడ్డి..
  • ఇన్ని లీకులు జరుగుతున్నా ఒక్క సమీక్ష నిర్వహించారా..?
  • 1. 92లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఒక్కటైనా నింపారా..?
  • జరిగిన తప్పులు సరిదిద్దుకోవాలనే ఇంగిత జ్ఞానం సర్కారుకు లేదు..
  • నిరుద్యోగులకు భరోసా కల్పించగలిగేది ఒక్క కాంగ్రెస్ పార్టీయే : రేవంత్..

హైదరాబాద్: గ్రూప్ వన్ ఎగ్జామ్స్‎ని హైకోర్టు రద్దు చేస్తున్నట్టు సంచలన తీర్పు ఇవ్వటంతో విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది. అయితే గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రద్దు అవటం ఇది రెండోసారి. పేపర్ లీక్ అవ్వడంతో మొదటిసారి ఎగ్జామ్ రద్దు కాగా రెండోసారి బయోమెట్రిక్ విధానాన్ని పాటించకపోవడంతో విద్యార్థులు కోర్టుకు వెళ్ళగా ఎగ్జామ్ రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. 2014లో తెలంగాణ వచ్చినప్పటి నుంచి యువత, విద్యార్ధులకు అడుగడునా పరాభావం ఎదురవుతూనే ఉంది. ఇంటర్మీడియెట్ పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన తప్పులతో 27 మంది విద్యార్ధుల ఆత్మహత్య, 2015లో సింగరేణి మొదలు, ఎంసెట్ పేపర్ లీకేజీ, విద్యుత్ సంస్థ నియామక పరీక్ష పేపర్ లీక్, పదో తరగతి పేపర్ లీకు, అక్కడి నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో పరాకాష్టం చేరింది.

ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించిన పాపాన పోలేదు అని విమర్శించారు. నీళ్లు, నిధులు నియామకాలు నినాదంతో తెలంగాణ యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చి 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ ఖాళీలను భర్తీ చేయాలన్నా ఆలోచన చేయ లేదు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ.3,106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేసి విద్యార్థులు మోసపోయారన్నారు. తల్లిదండ్రులు పంపించే చాలిచాలనీ డబ్బులతో హాస్టళ్లలో ఉండి కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టి పరీక్షలకు ప్రిపేరవుతున్నారు. మీ నిర్లక్ష్యం, అసమర్థత కారణంగా పేపర్ లీకేజీతో గతేడాది అక్టోబర్ 22న నిర్వహించిన గ్రూప్-1 పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది. ఇంత జరిగిన పేపర్ లీకేజీపై సరైన చర్యలు తీసుకోకుండా అందుకు కారణమైన వారిని శిక్షించకుండా ఈ ఏడాది జూన్ 11న మరోసారి గ్రూప్-1ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు.

- Advertisement -

తప్పులు దిద్దుకొని గత అనుభవం నుంచి ఈసారైనా పడక్బందీగా పరీక్ష నిర్వహిస్తారానుకుంటే పరీక్ష నిర్వహణలో డొల్లతనం బయట పడింది. బయోమెట్రిక్ తీసుకోకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు పొరపాట్లు చేసింది టీఎస్పీఎస్సీ . దీంతో కొంతమంది విద్యార్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అందుకు వారి తరపున ఎన్ఎస్‎యూఐ న్యాయం పోరాటం చేసింది. గ్రూప్-1 పరీక్ష నిర్వహణంలో ప్రభుత్వం విఫలం చెందినట్టు కోర్టు తీర్పుతో మరోసారి స్పష్టమైందని అన్నారు. పేపర్ల లీకేజీ స్కాం వెలుగులోకి వచ్చినప్పుడు అందుకు బాధ్యులైన ఏ ఒక్కరినీ వదలకుండా కఠినంగా చర్యలు తీసుకుంటే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించేది కాదని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇంత జరిగిన టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తారని, సంస్కరిస్తారనే నమ్మకం, విశ్వాసం లేదని.. అయితే ఈ ఈ నేపథ్యంలో తెలంగాణ యువత, నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఒక భరోసా కల్పించాలని భావిస్తోందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు