సమూహ సీఎండీ ‘కుర్రా మల్లికార్జున్’ కుతంత్రాలు
- ప్రీలాంచ్ పేరుతో మరో మోసపూరిత కంపెనీ
- 2020 నుంచి సాగిస్తున్న దారుణ దోపిడి
- ఫార్మా సిటీ పేరుతో రకరకాల ప్రాజెక్టులతో ఎర
- ఎకరం, అర ఎకరం, పావు ఎకరాలుగా అడ్డగోలు అమ్మకాలు
- ఎం.ఓ.యూ. లు చేస్తూ అక్రమ వసూళ్లు
- గ్రీన్ ఫార్మా, ఫార్మా వ్యాలీ, సొంతిళ్లు అంటూ ఆకర్షణీయమైన పేర్లతో ప్రాజెక్టులు
- డెవలప్‌మెంట్ చేస్తానని నమ్మిస్తూ మోసం
- ఆరునెలలుగా కార్యాలయానికి రాకుండా తప్పించుకు తిరుగుతున్న వైనం
కేశినేని డెవలపర్స్‌కి కుర్రా మల్లికార్జున్‌కి ఉన్న సంబంధం ఏమిటి..? సొమ్ముతో ఒక్క గుంట భూమి కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.. ఎందుకు ఇలాంటి పరిథితులు నెలకొన్నాయి..? ప్రభుత్వాలు, ప్రభుత్వ అధికారులు, సంబంధిత ప్రభుత్వ విభాగాలు నిబంధనలకు లోబడి పనిచేస్తే ఇలాంటి దుర్భర పరిస్థితులు ఎందుకు ఎదురవుతాయి..? అణువణువూ అవినీతి రాజ్యమేలుతుండగా సత్ఫలితాలను ఆశించడం కూడా సబబు కాదేమో..? అన్న అనుమానాలు కూడా వెలుగు చూస్తున్నాయి.. తాజాగా సమూహా ప్రాజెక్ట్స్ చేసిన, చేస్తున్న నిర్వాకంపై ‘ఆదాబ్’ అందిస్తున్న మరో సంచలన కథనం.. సమూహ ప్రాజెక్ట్స్ అనే ఆకర్షణీయమైన పేరుతో.. ఆకంపెనీకి సీఎండీ గా చెప్పుకుంటున్న కుర్రా మల్లికార్జున్ అనే వ్యక్తి, మరో ప్రీలాంచ్ దగాకోరు దందాకు తెరలేపాడు..

అమాయకులను టార్గెట్ చేసుకుని కోట్ల రూపాయలు కొల్లగొట్టాడు.. 2020 లో మొదలు పెట్టిన ఇతగాడి మోసపూరిత రియల్ ఎస్టేట్ వ్యాపారం అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది.. ఫార్మా సిటీ అంటూ ఆకర్షణీయమైన పేర్లతో రకరకాల ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి, దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నాడు.. నంది వనపర్తి దగ్గర గ్రీన్ ఫార్మా – 1 పేరుతో దాదాపు 120 ఎకరాలు.. తక్కెళ్ల పల్లిలో ఫార్మా వ్యాలీ పేరుతో 238 ఎకరాలు.. ఇబ్రహీంపట్నం, గుణగల్ లో సొంతిల్లు పేరుతో 100 ఎకరాల్లో తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు కట్టు కథలు చెబుతూ.. కేవలం అగ్రిమెంట్స్ చేస్తూ.. ఒక ఎకరం, అరెకరం, పావు ఎకరం చొప్పున అమాయకులకు అమ్మేసి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.. కాగా తాను ఎం.ఓ.యూ. చేసిన స్థలంలో అద్భుతమైన డెవెలప్మెంట్ చేస్తానని అడ్డగోలుగా నమ్మించాడు.. కానీ ఇప్పటివరకూ సదరు ఎం.ఓ.యూ. చేసిన స్థలాలలో డెవలప్మెంట్ చేసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు.. పైగా అసలు ఆ భూమి ఎక్కడ ఉందో కూడా తెలియకపోవడం దురదృష్టకరం..
నిజానికి సమూహ ప్రాజెక్ట్స్ కంపెనీకి ఉన్న అసలు భూమి ఎంత..? సీఎండీ గా కలరింగ్ ఇచ్చుకున్న కుర్రా మల్లికార్జున్ ఆ భూమిని ఎవరి దగ్గర కొన్నాడు..? ఎంతమంది అమాయకులకు అగ్రిమెంట్స్ చేశాడు..? కొన్న వారి దగ్గర నుంచి అతగాడు అసలు పట్టాలు చేసుకున్నాడా..? కాగా ఎన్ని వందల ఎకరాలు అమ్మాడు..? ఎంతమందికి అగ్రిమెంట్స్ చేశాడు..? పైగా ఒక ఎకరం అనిచెప్పి రెండు ఎకరాలకు అగ్రిమెంట్ చేయడం వెనుక మతలబు ఏమిటి..? డబుల్ అగ్రిమెంట్స్ ఎలా చేయగలిగాడు..? ఇప్పటికి 3 సంవత్సరాలు గడిచినా అభివృద్ధి లేదు, రిజిస్ట్రేషన్లు లేవు.. పైగా ధరణిని బూచిగా చూపి, కాకమ్మ కబుర్లు చెబుతూ దాటవేస్తున్నాడు.. దాదాపు ఇప్పటికి రూ. 500 కోట్ల పైనే వసూలు చేసినట్లు తెలుస్తోంది.. కాగా ఇతగాడు గచ్చిబౌలి లోని తన కార్యాలయానికి వచ్చి 6 నెలలు దాటిపోయినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. పొరబాటున బాధితులకు కనిపిస్తే ఎవరెవరో పేర్లు చెబుతూ తప్పించుకుంటున్నాడని తెలుస్తోంది.. అయితే ఇక్కడ అర్ధం కానీ విష్యం ఏమిటంటే ఈ కుర్రా మల్లికార్జున్ కి కేశినేని డెవెలపర్స్ కి వున్న సంబంధం ఏమిటి..? తాను మోసగించిన అమాయకులను నట్టేట ముంచి సరికొత్త దుఖాణం తెరిచాడా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. కుర్రా మల్లికార్జున్ చేసిన, చేస్తున్న దగాకోరు దందాలపై, కేశినేనితో కొత్తగా చేస్తున్న దోస్తీ వెనుక దాగిఉన్న విస్తుపోయే వాస్తవాల గురించి.. పూర్తి వివరాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘ ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం’..