- భారీగా పట్టుబడిన వెండి ..
- ఎలాంటి పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసిన ఎఫ్‌ఎస్‌టి అధికారులు
సూర్యాపేట : ఎన్నికల వేళ భారీగా నగదు, బంగారం, వెండి బయట పడుతుంది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఎలాంటి పత్రాలు లేకుండా నిల ఉంచిన 130కేజీల వెండి, రూ.3లక్షల నగదును పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు.పట్టుబడిన వెండి విలువ బహిరంగ మార్కెట్ లో దాదాపు రూ.కోటి పైగా ఉంటుందని అంచనా వేశారు.పూర్తి వివరాల ప్రకారం రాజస్థాన్ కు చెందిన ఉత్తమ్ సింగ్ సూర్యాపేట లోని అలంకార్ రోడ్ లో అద్దె ఇంట్లో ఉంటూ హోల్ సేల్ వెండి వ్యాపారం నిర్వహిస్తున్నారు. భారీగా వెండి ఉందన్న సమాచారంతో పోలీసులు, ఫ్లయింగ్ స్కార్డ్ టీం తనిఖీలు చేయగా ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు వాటిని సీజ్ చేసి కలెక్టరేట్ కు తరలించారు. ఈ తనిఖీల్లో ఎఫ్‌ఎస్ టి ఆఫీసర్ జగన్, వరుణ్, సిఐ నాగార్జున గౌడ్, ఎస్సై మహీందర్ తదితరులు ఉన్నారు.