Saturday, July 27, 2024

మేడ్చల్‌లో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌..!

తప్పక చదవండి
  • కాంగ్రెస్‌లో చేరిన మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి,
  • మేడ్చల్‌ జడ్‌పీ ఛైర్మెన్‌ శరత్‌ చంద్ర రెడ్డి,
  • సర్పంచ్‌, ఉప సర్పంచ్‌లు

మేడ్చల్‌ : మేడ్చల్‌లో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. మేడ్చల్‌ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే పలిపెద్ధి సుధీర్‌ రెడ్డి, మేడ్చల్‌ జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ మలిపెద్ధి శరత్‌ చంద్ర రెడ్డి తమ అనుచరులతో కలిసి బుదవారం బీఆర్‌ ఎస్‌ పార్టీకీ రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీ లో చేరారు. వారిని పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మాట్లా డుతూ… అవినీతిలో కూరుకుపోయిన మంత్రి మల్లారెడ్డిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్నారు. కొడంగల్‌లో ఓడిపోయిన నన్ను మల్కాజ్‌ గిరి పార్లమెంటు ప్రజలు కడుపులో పెట్టుకుని ఎంపీగా గెలిపించారని, ఇక్కడి ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో కాంగ్రెస్‌ ను గెలిపిస్తే మేడ్చల్‌ ప్రాంతాన్ని ఐటి, సాఫ్ట్‌ వేరు రాఘలాల్లో అన్ని రకాల అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుం టానని రేవంత్‌ హామీ ఇచ్చారు. మల్కాజ్‌ గిరి పార్లమెంటు నియోజక వర్గం లోని 5 అసెంబ్లీ నియోజక వర్గాలలో కాంగ్రెస్‌ జెండా ఎగుర వేస్తామని ధీమా వ్యక్తంచేశారు. టికెట్‌ రాని వారు నన్ను తిట్టినా కుటుంబ పెద్దగా వాళ్ల బాధను అర్థం చేసుకుంటున్నాను. వారికి భవిషత్‌ లో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
భూకబ్జాలకు కేరఫ్‌ మంత్రి మల్లారెడ్డి… అది óకార పార్టీలో ఉండి భూ కబ్జాలకు పాల్పడుతున్నామంత్రి మల్లా రెడ్డిని తరిమి కొట్టాలని మాజీ ఎమ్మల్యే మాలిపేద్ది సుదీరరెడ్డి అన్నారు. కార్యక్రమంలో మేడ్చల్‌, ఉప్పల్‌ నియోజక వర్గాల అభ్యర్తులు తోట కూర వజ్రేష్‌ యాదవ్‌, పరమేశ్వర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు