Wednesday, May 15, 2024

ముంబై చేరిన రోహిత్‌ సేన

తప్పక చదవండి

లక్నోలోని ఎకానా క్రికెట్‌ స్టేడియంలో జరిగిన ప్రపంచ కప్‌ మ్యాచ్‌లో డిఫెండిరగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను 100 పరుగుల తేడాతో ఓడిరచిన టీమ్‌ ఇండియా టోర్నమెంట్‌లో అజేయంగా కొనసాగుతోంది. పటిష్టమైన ఇంగ్లండ్‌ జట్టును ఆరంభం నుంచి భారత బౌలర్లు ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లండ్‌ కేవలం 129 పరుగులకే ఆలౌట్‌ చేశారు. దాదాపు సెమీ-ఫైనల్‌ టిక్కెట్‌ను ఖాయం చేసుకున్న టీమ్‌ ఇండియా ఇప్పుడు తమ తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడేందుకు ముంబైకి చేరుకుంది. నవంబర్‌ 2న రోహిత్‌ జట్టు తమ తదుపరి మ్యాచ్‌లో లంకతో తలపడనుంది. ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. దీంతో సెమీఫైనల్‌ టికెట్‌ ఖాయమైంది. అయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకోవాలంటే టీం ఇండియా మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో గెలవాల్సిన అవసరం ఉంది. టీం ఇండియా తన తదుపరి మ్యాచ్‌లో లంకతో తలపడుతుంది. తర్వాత దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌ టీంలతో ఆడాల్సి ఉంది. ఆటగాళ్ల గాయం సమస్యతో కుదేలైన శ్రీలంక జట్టు.. ఆడిన 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచి 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కానీ, సెమీ ఫైనల్‌ జట్టుకు ఇంకా అవకాశం ఉంది. తద్వారా లంక జట్టు మిగిలిన 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించి, టాప్‌ 4లో ఉన్న ఇతర జట్లు ఓడిపోతే సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశం ఆ జట్టుకు దక్కుతుంది. అయితే జట్టుకు పెద్ద తలనొప్పి గాయం సమస్య. టోర్నీ ప్రారంభానికి ముందు గాయం కారణంగా వనిందు హసరంగా వంటి ఆటగాడిని కోల్పోయిన లంక, టోర్నీ ప్రారంభమైన తర్వాత కెప్టెన్‌ దసును షనకతో సహా ముగ్గురు ఆటగాళ్లను కోల్పోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌లో అద్భుతంగా రాణించిన లహిరు కుమార్‌ గాయం కారణంగా ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. అతని స్థానంలో దుష్మంత చమీరా ఎంపికయ్యారు. ఇలా ప్రముఖ పేసర్‌ లేకుండానే బరిలోకి దిగుతున్న లంక భారత్‌ కు ఎలాంటి సవాల్‌ విసురుతుందో వేచి చూడాల్సిందే.

టీమ్‌ ఇండియా: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయాస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య.

- Advertisement -

శ్రీలంక జట్టు: పాతుమ్‌ నిస్సాంక, కుసల్‌ పెరీరా, కుసల్‌ మెండిస్‌ (కెప్టెన్‌), సదీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్‌, మహేశ్‌ థిక్షన్‌, కసున్‌ రజిత, దిల్షాన్‌ మధుశంక, దుష్మంత చమీర, దిముత్‌ కరుణరత్నే, చమీకరుణరత్నే, చమీకరుణరత్నే. , దుషన్‌ హేమంత.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు