Friday, May 17, 2024

ఎక్స్‌ కిరణాల ఆవిష్కర్త రాంట్జెన్‌

తప్పక చదవండి

అంతర్జాతీయ రేడియాలజి దినోత్సవం, ప్రతి సంవత్సరం నవంబరు 8న ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించబడుతోంది. ఆధునిక ఆరోగ్య సంరక్షణలో రోగ లక్షణాల సూచిక పాత్రను ప్రోత్సహించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 200లకు పైగా జాతీయ, ఇతర సంస్థలు ఈ అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని జరుపు కుంటాయి. విల్హేల్మ్‌ కన్రాడ్‌ రాంట్జెన్‌ ఎక్స్‌-రే కనుగొన్న నవంబర్‌ 8 వ తేదీనే రేడియాలజీ దినోత్సవం జరపాలని 2011, నవంబరు 28న చికాగోలో జరిగిన రేడియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా వార్షిక సమావేశంలో మూడు వ్యవస్థాపక సంఘాలు నవంబరు 8వ తేదీని అధికారికంగా ధృవీకరించాయి. అలా రాంట్జెన్‌ ఎక్స్‌-రేను కనుగొన్న రోజును పురస్కరించుకొని ఈ దినోత్సవం జరుప బడుతోంది. సంచలనాత్మక శాస్త్రీయ ఆవిష్కరణలకు స్వర్ణ యుగంమైన19 వ శతాబ్దంలో రోగ నిర్దారణకు కొత్త ఒరవడిని సృష్టించి, ప్రపంచంలో వైద్య రంగంలో రోగ నిర్దారణకు (రేడియోగ్రఫీ), రోగ నిర్మూలనకు (రేడియో థెరఫీ) కొరకు ఉపయోగించే ఎక్స్‌ కిరణాలను కనుగొన్న ప్రఖ్యాత శాస్త్రవేత్త విల్హేల్మ్‌ కన్రాడ్‌ రాంట్జెన్‌. ఆయన కనుగొన్న ఎక్స్‌ కిరణాలు వైద్యరంగం లోనె కాక భద్రతా రంగంలో ఉపయోగ పడుతున్నా యి. విల్హేల్మ్‌ కన్రాడ్‌ రాంట్జెన్‌ (మార్చి 27,1845 – 1923 ఫిబ్ర వరి 10) జర్మన్‌ దేశ భౌతిక శాస్త్ర శాస్త్రవేత్త. 1895 నవంబరు 8 న విద్యుదయస్కాంత తరంగాలలో వివిధ తరంగ దైర్ఘ్యలుల అవధులలో గల ఎక్స్‌- కిరణాలను కనుగొన్నాడు. ఈ పరిశోధన వల్ల 1991 లో భౌతిక శాస్త్రంలో మొదటి సారి నోబెల్‌ బహుమతి పొందాడు. ఆయన చేసిన కృషికి గాను ఆవర్తన పట్టిక లో 111 పరమాణు సంఖ్య గల మూలకానికి రాంట్‌ జీనియమ్‌ అనిపేరు పెట్టి గౌరవించారు. రాంట్జన్‌ 1845 మార్చి 27 న జర్మనీలోని లెన్నెస్‌ లో జన్మించాడు. ఈయన తండ్రి ఒక రైతు. తల్లి ఒక డచ్‌ మహిళ. హాలెండ్‌లో విద్యాభ్యాసం జరిగింది. 1865 లో యుట్రెచ్‌ యూనివర్సిటీలో చేరుటకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కాని జూరిచ్‌లో గల ఫెడెరల్‌ పాలిటెక్నిక్‌ సంస్థ లో చేరి పరీక్షలను ఉత్తీ ర్ణుడయ్యాడు. అక్కడ మెకానికల్‌ ఇంజనీ రుగా చేరాడు. 1869 లో తత్వ శాస్త్రములో జూరిచ్‌ విశ్వ విద్యాల యం నుండి పి.హెచ్‌. డి పట్టాను పొందాడు. ఆ విశ్వ విద్యాల యంలో ప్రముఖ ప్రొపె సర్‌ అయిన ఆగస్టుకుండ్త్‌కు ప్రియమైన శిష్యుడయ్యాడు. 1874 లో స్టాన్‌ ఫర్డు విశ్వ విద్యాలయంలో అద్యాపకునిగా నియమించ బడ్డాడు. 1875 లో హోహెనీం విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్‌ గా, తర్వాత 1876 లో స్టాన్‌ ఫర్డు విశ్వ విద్యాలయంలో మరల అద్యాపకునిగా, 1888 లో గీసన్‌ విశ్వ విద్యాలయంలో భౌతిక శాస్త్ర ఆచార్యునిగా, తర్వాత వుర్జ్‌ బర్గ్‌ విశ్వ విద్యాలయంలో భౌతిక శాస్త్ర విభాగంలో విధులు నిర్వర్తించాడు. 1900లో ప్రభుత్వ అభ్యర్థనపై మంచ్‌ యూనివర్సిటీలో చేరాడు. ఆయన కుటుంబం యు.ఎస్‌.ఎకు వలస వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. న్యూయా ర్క్‌లో కొలంబి యా యూనివర్సిటీ వారు అవకాశం యిచ్చిన ప్పటి కీ మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా తన శేష జీవితాన్ని మునిచ్‌ నందే గడిపాడు. 1895 వరకు ఉత్సర్గనాళ ప్రయోగాలలో హెర్ట్జ్‌, జాన్‌ హిటార్ఫ్‌, విలియం క్రూక్స్‌, టెస్లా,లీనార్డో లతో పని చేశాడు. ఎక్స్‌ కిరణాలను రాయింట్‌ జన్‌ కిరణాలని అంటారు. కాని రాంట్జెన్‌ స్వయంగా వాటిని ఎక్స్‌ కిరణాలని పిలిచాడు. ఈ కిరణాలను కనుగొని లోకానికి పరోపకారం చేసినందుకు కృతజ్ఞత గా ఆయనకు 1901లో భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహు మతి లభ్యమయింది. ఈఎక్స్‌రే వెనుక ఎంతో ఆసక్తి కరమైన కథ ఉంది. రాయింట్‌ జన్‌ కేథోడ్‌ రే ట్యూబ్‌ (శూన్య గాజు నాళం) తో పరిశోధనలు చేసేవాడు. గది అంతా చీకటిగా ఉన్నప్పుడు యీ ట్యూబ్‌ గుండా కాంతి కిరణాలను పంపడం జరిగింది. పైగా ట్యూబ్‌ చుట్టూ నల్లని కాగితాన్ని కాంతి కిరణాలు ఏకొంచెం కూడా వెలువడ కుండా కప్పి ఉంచాడు. ఇలా చేసినప్పటికి కాథోడ్‌ ట్యూబ్‌ కు సమీపంలో ఉన్న బేరియం ప్లాటినో సైనైడ్‌ స్ఫటికం వింత మెరుపులతో ప్రకాశించ సాగింది. నల్లటి కాగితాన్ని కప్పి ఉంచినప్పటికీ కాథోడ్‌ ట్యూబ్‌ నుంచి ఏవో అజ్ఞాత కిరణాలు వెలు వడి బేరియం ప్లాటినో సైనైడ్‌ స్ఫటికం మీద పడి అది మెరిసేటట్లు చేసిందని ఆయన ఊహించ గలిగాడు. ఈ కిరణా లను కాగితం గుండా, చెక్క గుండా, లోహపు పలకల గుండా ప్రయాణం చేయ గలవని యీ యన కనుగొన్నాడు. ఈ కిరణాలు కూడా ఓరకమైన కాంతి కిరణాలే అని అయితే వీటి తరంగ దైర్ఘ్యం చాలా తక్కువ కావటం వల్ల మనుషుల కళ్ళకు కనిపించ వని రాయింట్జన్‌ వెల్లడి ంచాడు. మామూలు కాంతి కిరణాలే ఫోటో గ్రాఫిక్‌ ప్లేట్ల మీద ప్రభావం చూపుతూ ఉండగా, యీ కిరణాలు మాత్రం చూప కుండా ఉం టాయా అనే ఆలోచన రాయింట్‌ జెన్‌ కి రావటం – శాస్త్ర ప్రపం లో ఒక సరికొత్త అధ్యాయానికే కారణ భూతమైనది. ప్రయోగం చేయటం కోసం రాంట్జెన్‌ ఫోటో గ్రాఫిక్‌ ప్లేటు మీద తన భార్య చేతిని ఉంచి యీ కిరణాలను ప్రసారం చేసి ఫోటోను డెవలప్‌ చేసి చూసి ఆశ్చర్య పోయాడు. చేతి ఎము కలు ఉంగరం తో సహా ఆ ఫోటోలో వచ్చింది. చుట్టూ మాంసం ఉన్నట్లు మసక మసకగా ఉంది. అంటే సజీవంగా ఉన్న మనిషి కంకాళాన్ని ఈకిర ణాల ద్వారా ఫోటో తీయవచ్చని స్పష్టంగా తేలింది. దురదృష్ట వశాత్తు రాంట్జెన్‌, ఆయనతో కలిసి పనిచేసిన మరో ఇద్దరు పరి శోధకులు యీ ఎక్స్‌ కిరణాల తాకిడికే క్రమ క్రమంగా మరణిం చాడు. ఈఎక్స్‌-కిరణాల వల్ల ఎంతో ప్రయోజ నం కలుగుతున్న ప్పటికీ వాటిని మితిమీరి వాడితే మాత్రం ప్రమా దం తప్పదని, యీ కారణంగానే ఎక్స్‌-కిరణాలను నిరంతరం గురి కాబట్టే రాంట్జెన్‌ ఆ కిరణాల ప్రభావంగానే చని పోయాడని రుజువైంది. రేడియో ధార్మికత నుండి రక్షించు కొనుటకు సీసపు కవచాలు వాడే కొద్దిమంది మార్గ నిర్దేశకులో ఆయన ఒకరు. ఆయన చేసిన ఆవిష్కరణలకు పేటెంట్‌ హక్కులు కూడా తీసుకో లేదు. నోబెల్‌ బహుమతిగా వచ్చిన ధనమును వర్జ్‌బర్గ్‌ విశ్వ విధ్యా లయమునకు విరాళంగా యిచ్చాడు. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల యేర్పడే ద్రవ్యోల్బణం వల్ల రాంట్జెన్‌ చాలా పేదరికంలో మగ్గాడు. తన శేష జీవితాన్ని మునిచ్కి సమీపంలో గల విల్‌ హెల్మ్‌ లో గల యింటిలో గడిపాడు. ఆయన కోరిక ప్రకారం ఆయన వ్యక్తిగత, శాస్త్రమునకు సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆయన మరణం తర్వాత నాశనం చేయటంజరిగింది. 1901లో రాంట్జెన్‌కు మొదటి భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి వచ్చింది. ఈ బహుమతి ఆయన ఎక్స్‌ కిరణాలు కనుగొని విశేష సేవలందిం చినందుకు గాను యివ్వ బడిరది. కాని రాంట్‌ జెన్‌ ఆ బహుమ తికి వచ్చిన ఆర్థిక ప్రతిఫలాన్ని తన విశ్వ విద్యాలయ మునకు దానమిచ్చాడు. పియరీ క్యూరీ వలే రాంట్జెన్‌ తన పరిశోధనకు పేటెంట్‌ హక్కులను తిరస్క రించాడు. మానవాళికి తన పరిశోధన యొక్క ఫలితాలు ఉపయో గకరంగా ఉండాలని, ఈ కిరణాలకు తన పేరు కూడా పెట్టరాదని కోరుకున్నాడు. రమ్‌ ఫోర్డ్‌ మెడల్‌ (1896), మాటెక్కీ మెడల్‌ (1896), ఎలియట్‌ క్రెస్సన్‌ మెడల్‌ (1897), భౌతిక శాస్త్రంలో నోబెల్‌ బహుమతి (1901) పొం దాడు. నవంబరు 2004లో పరమాణు సంఖ్య 111గా గల మూలకానికి ఆయనపై గౌరవార్థం రాంట్జెనీయం (Rస్త్ర) అని IఖూAజ సంస్థ నామకరణం చేసింది. IఖూAూ కూడా ఈపేరును నవంబరు 2011లో దత్తత తీసుకుంది.
` రామ కిష్టయ్య సంగన భట్ల 9440595494

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు