Sunday, May 19, 2024

తెలంగాణ ట్యాగ్ లైన్ తో ఏర్పడిన రాష్ట్రం కాదు..

తప్పక చదవండి
  • తెలంగాణ ఏర్పాటు పై రేవంత్ కీలక కామెంట్స్
  • నీళ్లు, నిధులు, నియామకాలు టీఆర్ఎస్ పార్టీ స్లోగన్
  • అది దిక్కుమాలిన నినాదం..
  • మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి..

హైదరాబాద్ : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏ ట్యాగ్‌లైన్‌తోనూ ఏర్పాటు కాలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. నీళ్లు, నిధులు, నియమాకాలు అనేది దిక్కుమాలిన స్లోగన్ అని అన్నారు. అది టీఆర్ఎస్ పార్టీ స్లోగన్ అని.. ప్రజల స్లోగన్ కాదని అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. ‘ ఏ ట్యాగ్‌లైన్‌తోనూ తెలంగాణ ఏర్పడలేదు. అది తప్పు. నీళ్లు, నిధులు, నియామకాలు అనేది ఆ దిక్కుమాలిన టీఆర్ఎస్ స్లోగన్. అది ప్రజల స్లోగన్ కాదు. ప్రజల స్లోగన్.. స్వేఛ్చా, సామాజిక న్యాయం, సమాన అభివృద్ది. తెలంగాణ ప్రజలు కోరుకున్నది ఇది. ఆంధ్రోళ్ల పెత్తనమేంది ? మా ప్రాంతానికి అభివృద్ధి ఎందుకు జరుగుతలేదు ? మా సామాజిక వర్గాల సమతుల్యతను ఎందుకు పాటిస్తలేరు ? అనే ట్యాగ్‌లైన్‌తో తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం కోట్లాడిర్రు. ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు రాలేదా ? పెన్షన్ రాలేదా ? ఇండ్లు మంజూరు కాలేదా ? ఉచిత కరెంట్ రాలేదా ?’ అని రేవంత్ ప్రశ్నించారు.

ఇక రేవంత్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో సోషలో మీడియాలో వైరల్ కాగా.. నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉందని.. అంటే ఆరోజు ప్రజలకు స్వేచ్ఛ లేదని ఒప్పుకుంటున్నారా ? అని ప్రశ్నించారు. స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో ఏపీ మాజీ సీఎం చంద్రబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన అరెస్టును రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు ఖండించారు. చంద్రబాబు సన్నిహితుడిగా రేవంత్‌కు పేరుంది. అదే విషయాన్ని మీడియా రేవంత్‌ను ప్రశ్నించింది. చంద్రబాబు అరెస్టును ఏ విధంగా చూస్తారని అడగ్గా.. ‘ఎట్ల చూస్తలేం.. ఎట్ల జరుగుతుందో అట్లనే చూస్తున్నాం. అరెస్ట్ చేసినట్లే చూస్తున్నాం’ అని సమాధానం ఇచ్చారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు అంశంపై జాగ్రత్తగా స్పందించడంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవేళ చంద్రబాబు అరెస్ట్‌ను రేవంత్ రెడ్డి ఖండిస్తే.. అది అధికార బీఆర్ఎస్‌కు రాజకీయ ఆయుధంగా మారే అవకాశం ఉంటుంది. రేవంత్ చంద్రబాబు శిష్యుడని తరచూ బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తుంటుంది. చంద్రబాబు ఆలోచనలు, విధానాలనే రేవంత్ రెడ్డి అమలు చేసేందుకు ప్రయత్నిస్తారని ఆరోపిస్తుంటుంది. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ జరిగి వారం రోజులు గడిచినా.. ఈ అంశంపై రేవంత్ రెడ్డి ఎక్కడా స్పందించలేదు. తాజాగా స్పందించినా ఆచితూచి మాట్లాడారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు