Sunday, May 19, 2024

తొలి ప్రపంచ తెలుగు పెట్టుబడుల సదస్సుకు సన్నద్ధం

తప్పక చదవండి
  • అబుదాబీలో 8వ వరల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరం
    సదస్సులో కీలక చర్చలు
  • డబ్ల్యూటీఐటీసీ చైర్మన్‌ సందీప్‌ మఖ్తలను జెనీవాకు ఆహ్వానించిన డిప్యూటీ జనరల్‌ పెడ్రో

మఖ్తల్‌ : యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ నాయ కత్వాన అబుదాబీలో నిర్వహించిన 8వ వరల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫోరం సదస్సులో వరల్డ్‌ తెలుగు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ చైర్మన్‌ సందీప్‌ కుమార్‌ మఖ్తల నాయకత్వంలోని బృందం తమ ప్రత్యేక ముద్రను వేసుకుంది. వరల్డ్‌ తెలుగు ఇన్వెస్ట్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌కు ఈ ప్రత్యేక సందర్భం సాక్ష్యంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే వారికి అనుసంధానం కల్పించడం, పెట్టుబడులకు ప్రోత్సాహం, ఆవిష్కరణలకు మద్దతు అందించడం ఉద్దేశంగా చేసిన ఈ ప్రతిపాదనకు యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ పెద్ద ఎత్తున మద్దతు దక్కింది. యునైటెడ్‌ నేషన్స్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ట్రేడ్‌ ఆండ్‌ డెవలప్‌మెంట్‌ డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ పెడ్రో మాన్యువల్‌ మోరెనో ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నూతన ప్రతిపాదన ఆర్థిక వృద్ధికి దోహదం చేయడమే కాకుండా ఆవిష్కరణలకు అండగా నిలుస్తుందని తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఉన్న తమ ప్రధాన కార్యాలయాన్ని డబ్ల్యూటీఐటీసీ బృందం సందర్శించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ ఆహ్వానం ఇటు డబ్ల్యూటీఐటీసీ అటు యూఎన్‌సీటీఏడీకి తెలుగువారికి ఆర్థిక, సాంకేతిక అంశాల్లో పురోగతిని తెలియజేసేందుకు కలిగిన ఉన్న నిబద్దతను చాటి చెప్తోంది. ఈ సందర్భంగా వరల్డ్‌ తెలుగు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కౌన్సిల్‌ (డబ్లూటీఐటీసీ) చైర్మన్‌ సందీప్‌ మఖ్తల మాట్లాడుతూ… డబ్ల్యూటీఐటీసీ నెట్‌వర్క్‌కు అంతర్జాతీయ స్థాయిలో అనుసంధానం అవడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం , అనేక వర్గాలతో చర్చలు నిర్వహించేందుకు కలిగిన గొప్ప అవకాశంగా పేర్కొంటున్నామని అన్నారు. వరల్డ్‌ తెలుగు ఇన్వెస్ట్‌మెంట్‌ కాన్ఫరెన్స్‌ యొక్క విజన్‌ ద్వారా అంతర్జాతీయ పెట్టుబడులు సాధిస్తామనే విశ్వాసం కలిగి ఉన్నామని… దీంతోపాటుగా మా సంస్థల మధ్య ప్రత్యేకమైన అనుసంధాన వేదికగా ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశం ద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న తెలుగు మాట్లాడే వారికి సంబంధించిన వివిధ అంశాల పరిష్కార వేదికగా సుస్థిర భాగస్వామ్య అంశంగా నిలుస్తుందని విశ్వసిస్తున్నామని చెప్పారు. ఆయా భాగస్వామ్య పక్షాల మధ్య అనుసంధానం మరియు సమన్వయం చేసుకునేందుకు మాత్రమే కాకుండా నూతన ఆలోచనలను ప్రోత్సహించే వేదికగా సైతం డబ్ల్యూటీఐటీసీ, యూఎన్‌సీటీఏడీ నిలుస్తుంది అని విశ్వాసం వ్యక్తం చేశారు. మొట్టమొదటిసారిగా జరిగే ప్రపంచ తెలుగు పెట్టుబడుల సదస్సు తేదీలను త్వరలో ప్రకటిస్తామని మఖ్తల ఈ సందర్భంగా తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు