Monday, May 20, 2024

ప్యాట్‌ కమిన్స్‌ జాక్‌పాట్‌

తప్పక చదవండి

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2024 మినీ వేలంలో న్యూజీలాండ్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్రకు నిరాశే ఎదురైంది. కనీసం రూ. 5 కోట్ల ధర పలుకుతాడనుకున్నా.. రూ. 1.8 కోట్లు మాత్రమే దక్కాయి. రూ. 50 లక్షల కనీస ధరతో వచ్చిన రచిన్‌ను సొంతం చేసుకోవడానికి ఏ ప్రాంచైజీ పెద్దగా ఆసక్తి చూపలేదు. ఢల్లీి క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య కాస్త పోటీ నెలకొన్నా.. చివరికి సీఎస్‌కే దక్కించుకుంది. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధరను కమిన్స్‌ సొంతం చేసుకున్నాడు. ఏకంగా రూ. 20.50 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో పోటీ పడిన సన్‌రైజర్స్‌ ఓనర్‌ కావ్యా మారన్‌ చివరకు కమిన్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్‌ చరిత్రలో కమిన్స్‌ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఏ ఆటగాడికి కూడా రూ. 20 కోట్ల ధర లేదు. గత సీజన్లో రూ. 7. 25 కోట్లకు అమ్ముడైన కమిన్స్‌కు ప్రపంచకప్‌ 2023 గెలవడంతో ఈ సీజన్‌ లో భారీ డిమాండ్‌ ఏర్పడిరది. 2020, 2021 సీజన్లో ఆస్ట్రేలియా సారథి రూ. 15. 50 కోట్లకి అమ్ముడుపోయాడు. శ్రీలంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగను రూ 1.50 కోట్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంతం చేసుకుంది. కనీస ధర రూ. కోటితో వచ్చిన హసరంగ్‌ను కొనుగోలు చేయడానికి ఏ ప్రాంచైజీ ఆసక్తి చూపలేదు. అఫ్గాన్‌ బ్యాటర్‌ అజ్మతుల్లా ఒమర్జాయ్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ దక్కించుకుంది. బేస్‌ ప్రైస్‌ రూ. 50 లక్షల వద్దే గుజరాత్‌ అతడిని సొంతం చేసుకుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు