Sunday, May 5, 2024

నేను ఉన్నాను…మీ బాధలు విన్నాను..

తప్పక చదవండి
  • మీ కష్టాలు స్వయంగా చూస్తున్నాను..
  • మినీ ఇండియాలో సమస్యలు తీష్ట వేశాయి…
  • సమస్యల పరిష్కారానికి నాది పూచీ…
  • ఒక్కసారి గెలిపించండి మీకు సేవ చేస్తా…
    : నీలం మధు ముదిరాజ్…
  • పాదయాత్రకు దండుగట్టిన ప్రజలు..
  • నాలుగో రోజు గ్రాండ్ సక్సెస్…

ఆయన తమ గుమ్మంలోకి రాగానే కడుపున పుట్టిన బిడ్డ వచ్చినట్లు భావిస్తున్నారు.. తమ కష్టాలు తీర్చే తనవాడు వచ్చాడని సంబరపడిపోతున్నారు.. కష్టాలను చెప్పుకుంటూ సేదతీరుతున్నారు.. ఆయనను గెలిపించుకుంటామని మనసారా వాగ్ధానం చేస్తున్నారు.. అన్ని వర్గాల ప్రజల కళ్లల్లో ఆనందం.. అంతులేని ధైర్యం.. ఆ బిడ్డ మరెవరో కాదు నీలం మధు ముదిరాజ్.. కళ్లనీళ్లు తుడుస్తూ.. తానున్నాననే అభయమిస్తూ.. ప్రతి గడప గుండెను తడుతూ సాగిపోతున్నాడు.. నాలుగవరోజు పాదయాత్ర విజయవంతంగా కొనసాగించాడు..

హైదరాబాద్ : నీలం మధు ముదిరాజ్ తన పాదయాత్రలో భాగంగా నాలుగో రోజు గురువారం గుమ్మడిదల మండలం బొంతపల్లి, వీరన్న గూడెం, కట్టెన్నక గుడెం గ్రామాలలో యాత్రను కొనసాగించారు… మినీ ఇండియాగా చెప్పుకునే పటాన్ చెరు నియోజకవర్గంలో ఎటు చూసినా సమస్యలు తిష్ట వేశాయని ఎన్ఎంఅర్ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్ ఆరోపించారు.

- Advertisement -

మీ కొడుకు మీ ఇంటి గుమ్మంలో :
పాదయాత్ర ప్రారంభానికి ముందు బొంతపల్లిలోని ప్రసిద్ధ క్షేత్రమైన వీరభద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గడపగడపకు వెళ్లి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీలం మధును ఆప్యాయంగా ఆహ్వానించి తమ సమస్యలను మొర పెట్టుకున్నారు. ఈ సంధర్బంగా ప్రజలతో మమేకమవుతూ తాను అండగా ఉంటానని భరోసా ఇస్తూ.. తాను గెలవగానే సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు నివాసముండే పటాన్ చెరు నియోజకవర్గం సమస్యలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. నియోజకవర్గంలో ఏ వాడలో, గ్రామంలో చూసినా సమస్యలు తిష్ట వేసి స్వాగతం పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత పది ఏళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని గొప్పలు చెబుతున్న నాయకులకు, ప్రజల సమస్యలు కనబడడం లేదా అని ప్రశ్నించారు. గ్రామంలో ఏ వాడకెళ్ళినా శిథిలావస్థలో ఉన్న ఇండ్లు దర్శనమిస్తున్నాయని, ఏ గల్లికి వెళ్లినా మురికి కాలువలు దర్శనమిస్తున్నాయని ఆరోపణలు గుప్పించారు. ఇదేనా ఇన్ని ఏండ్లలో జరిగిన అభివృద్ధి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం, మన ఆత్మగౌరవమే ఎజెండాగా నేను ప్రజల్లోకి పాదయాత్రగా వచ్చానని వివరించారు.

ఎవ్వరు అధైర్య పడాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికి భరోసాగా నేను ఉంటానన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలతో మమేకమయ్యే అవకాశంతో పాటు వారి సమస్యలను, వారి బాధలను కళ్లారా చూస్తున్నానన్నారు. ఈ బాధలు తీరాలంటే మీ ఇంట్లో బిడ్డ ఎమ్మెల్యేగా గెలుపొందలన్నారు. ప్రజల కష్టాల్లో అండగా ఉంటూ అనునిత్యం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నాకొక అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మీకు సేవ చేసుకోవడంతో పాటు, ప్రజలందరికీ సమస్యల నుంచి విముక్తి కల్పిస్తానని భరోసా ఇచ్చారు. మీ ఇంట్లో బిడ్డ ఎమ్మెల్యేగా ఉంటే మన అభివృద్ధి మనమే చేసుకోవచ్చని పునరుద్గటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కుల సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు