- చంద్రయాన్ విజయం అపూర్వం, అనితర సాధ్యం..
- ఇస్రో శాస్త్రవేత్తల కృషి అభినందనీయం..
హైదరాబాద్:
చంద్రయాన్ -3 విజయవంతం అవడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి.. హైదరాబాద్ నగరంలో సైతం పలుచోట్ల ఆనందంతో కూడిన పలు కార్యక్రమాలు చేసుకున్నారు నగర వాసులు.. ఈ కోవలోనే ఇస్తో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలుపుతూ.. వారి కృషిని చాటుతూ.. హైదరాబాద్, కోటి లోని వీ.హెచ్.పీ. కార్యాలయం పక్కన నెలకొని ఉన్న వాసు బుక్ సెంటర్, రాఖి బుక్ కార్నర్ యాజమాన్యాల వారు సంబరాలు చేసుకున్నారు.. భారత ఘన కీర్తిని వేనోళ్ళా కొనియాడారు..