Thursday, May 16, 2024

దేవాదుల పైపులైన్ ద్వారా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్సీ పల్లరాజేశ్వర్ రెడ్డి..

తప్పక చదవండి
  • సీఎం కేసీఆర్ సహకారంతో ఎగువ ప్రాంతాలకు సాగునీరు..
  • సస్యశ్యామలం కానున్న మిట్ట ప్రాంతాలు..
  • వేలేరు మండలానికి, చుట్టూ ప్రక్కల ప్రాంతాల గ్రామాలకు సాగునీరు..
  • నిధులు మంజూరు చేసి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన పల్లా..

జనగామ : స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో దేవాదుల పైప్ లైన్ ద్వారా నీటిని విడుదల చేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేసిన రైతులు, మండల ప్రజా ప్రతినిధులు నీళ్లు , నిధులు, నియమకాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరం తడిసేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, సీఎం కేసీఆర్ సహకారంతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించేందుకు నిధులు మంజూరు చేసారని, సీఎం కేసీఆర్ సహకారంతోనే ఎగువ ప్రాంతాలకు సాగునీరు వచ్చిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు, పైపు లైన్ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వేలేరు మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు అందించేందుకు ఫిబ్రవరిలో మంత్రి కేటీఆర్ తో సోడాశపల్లి లో శంకుస్థాపన చేయగా పైపులైన్ పూర్తి చేసి నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. ఈ పైపులైన్ ద్వారా వేలేరు, లోక్యతండా, మిరపకుంట తండా, చింతల తండా, ఎర్రబెల్లి, ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, నారాయణగిరి గ్రామాల్లోని కుంటలు, చెరువులకు సాగునీరు అందుంతుందని తెలిపారు. కన్నారం గ్రామం చెరువులోకి నీరు అందించే పైపులైన్ పనులను ఇటీవలనే ప్రారంభించినట్లు తెలిపారు. కన్నారం నుండి పిచర, వావిళ్ళకుంటా తండా చెరువులకు వచ్చే యాసంగి వరకు సాగునీరు వస్తుందని హామీ ఇచ్చారు. అలాగే చిల్పూర్ మండలంలోని పలు గ్రామాలకు సైతం సాగు నీరు వస్తుందని తెలిపారు. సాగునీరు అందించేందుకు సహకారం చేసిన మంత్రులకు, ఎమ్మెల్యే లకు, మండల ప్రజాప్రతినిధులకు, సర్పంచ్ లకు, ఎంపీటీసీ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వేలేరు మండలంలోని పలు గ్రామాలకు సాగునీరు రావడంతో రైతులు సంతోషంతో హర్షం వ్యక్తం చేశారు. సాగునీరు అందించేందుకు కృషి చేసిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి మండల ప్రజలు, నాయకులు, రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు