Saturday, May 18, 2024

మిషన్‌ భగీరథ ఏడపాయే: గుండాల మదన్‌ కుమార్‌

తప్పక చదవండి
  • 40 వేల కోట్ల దుర్వినియోగం.. డబ్బులు దండుకున్న కాంట్రాక్టర్లు
  • పైపులైన్‌ కలెక్షన్‌ పేరుతో రోడ్లు అన్నీ ఆగమాగం
  • నేటికీ కనబడని మిషన్‌ భగీరథ నీరు

నర్సంపేట : నెక్కొండ మండలం లోని పనికర గ్రామం లో బీ.ఎస్‌.పి నాయకులు ప్రసంగి అధ్యక్షతన బైక్‌ ర్యాలీ ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి బీ.ఎస్‌.పి ఎమ్మెల్యే అభ్యర్థి గుండాల మదన్‌ కుమార్‌ పాల్గొనీ బైక్‌ ర్యాలీ నీ ప్రారంభించారు. ఈ బైక్‌ ర్యాలీ పనికర లో మొదలై దీక్షకుంట, బంజరుపల్లి, అమినాబాద్‌, మీదుగా నెక్కొండ మండల కేంద్రానికి చేరుకొని అక్కడ ర్యాలీని ఉద్దేశించి బీ.ఎస్‌.పి బలపర్చిన ఎమ్మెల్యే అభ్యర్థి డా.మదన్‌ కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపుగా పది సంవత్సరాలు అవుతున్న కెసిఆర్‌ చెప్పిన ఏ హామీ పూర్తి చేయలేకపోయారని ఆరోపించారు. మిషన్‌ భగీరథ పేరుతో 40 వేల కోట్లు దుర్విని యోగం జరిగిందని మిషన్‌ భగీరథ పేరుతో కాంట్రాక్టర్లు బాగుపడ్డారే తప్ప సామాన్య ప్రజలకు ఏమి మేలు జరగలేదనరు పైపులైన్ల కలెక్షన్‌ పేరుతో కాంట్రాక్టర్లు రోడ్లు అంత ఆగమాగం చేశారని అయినా నేటికి కూడా నర్సంపేట నియోజకవర్గం లో సుక్క ఇవ్వలేకపోయారని మదన్‌ కుమార్‌ మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో నియోజకవర్గ అధ్యక్షులు బుర్రి సాగర్‌, మహిళా కన్వీనర్‌ గాధం స్వప్న యాదవ్‌,జిల్లా ప్రధాన కార్యదర్శి మాసని రమేష్‌, గజ్జి దయాకర్‌ బీ.ఎస్‌.పి. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు