Tuesday, May 14, 2024

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట

తప్పక చదవండి
  • షూటింగ్‌ విభాగంలో ఐదో పతకం

హాంగ్జౌ : ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల షూటింగ్‌ విభాగంలో ఐదో పతకం దక్కింది. మెన్స్‌ 25 విూటర్ల రాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో ఆదర్శ్‌ సింగ్‌ టీమ్‌ కాంస్యం నెగ్గింది. విజయ్‌వీర్‌ సిధు, అనిష్‌ భన్వాలా, ఆదర్శ్‌ సింగ్‌లతో కూడిన జట్టు 1718 స్కోర్‌తో మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. 1765 స్కోర్‌తో చైనా గోల్డ్‌ మెడల్‌ గెలువగా, 1734 స్కోర్‌తో కొరియా సిల్వర్‌ దక్కించుకుంది. అంతకుముందు పురుషుల 10 విూటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో ఐశ్వరి ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌కు కాంస్యం సాధించాడు. పురుషుల 10 విూటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రుద్రాంక్ష్‌ పాటిల్‌, దివ్యాన్ష్‌ సింగ్‌ పన్వర్‌, ఐశ్వరి తోమర్‌లతో కూడిన టీమ్‌ బంగారు పతకం గెలిచింది. ఆదివారం మహిళల 10 విూటర్ల ఎయిర్‌ రైఫిల్‌ టీమ్‌ ఈవెంట్‌లో రమిత, మొహులీ ఘోష్‌, ఆషి చౌక్సీతో కూడిన జట్టు రజత పతకం నెగ్గింది. మహిళల 10 విూటర్ల ఎయిర్‌ రైఫిల్‌ వ్యక్తిగత విభాగంలో రమిత జిందాల్‌ కాంస్య పతకం గెలుచుకుంది. దాంతో ఇప్పటివరకు షూటింగ్‌లో భారత్‌ నెగ్గిన పతకాల సంఖ్య ఐదుకు పెరిగింది. మొత్తం పతకాల సంఖ్య 10కి చేరింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు