Monday, April 29, 2024

మేయర్‌ వా..!కమీషన్ల బ్రోకర్‌ వా..?

తప్పక చదవండి
  • డబ్బులివ్వండి… ఇళ్ళు కట్టుకోండి అంటున్న పీర్జాదిగూడ మున్సిపల్‌ మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డి
  • పార్కులు, రోడ్లు కబ్జా పెట్టుకోండి అడుగం.
  • సెట్‌ బ్యాక్‌లు చూడం.. ఎన్ని అంతస్తులైన పట్టించుకోం
  • మెయిన్‌ రోడ్డుకు ఇరువైపులా భారీ అక్రమ షెడ్లు..
  • ఎఫ్‌టిఎల్‌, బఫర్‌ జోన్లు, చివరికి స్మశానంలో అక్రమ నిర్మాణం చేసినా చూడం.
  • కోట్ల రూపాయలు నష్ట పోతున్నా పట్టించుకోని మున్సిపల్‌ కమీషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పూర్తిగా అవినీతి మయం అయిపోయింది. ఇంకా బీఆర్‌ఎస్‌ మేయర్‌ అతని సహచర ప్రజాప్రతినిధులు, అధికారులు అవినీతి, ఆక్రమాలను మరువలేక పోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతూ, సంపాదనకు ఎగబడ్డారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ లోని పలు డివిజన్లలో అనుమతులు ఒకలా నిర్మాణాలు మరోలా చేపడుతున్నారు.జనావాసాల మధ్య భారీ గోదాంలు లేదా భారీ షెడ్లు నిర్మాణం చేపడుతుంటే ఎన్ని పిర్యాదులు వచ్చిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడరు. ఇదంతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డి అండదండలతో దాదాపు చాలా డివిజన్లలో ఎటువంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున నిర్మాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి.

పీర్జాదిగూడ మేయర్‌ డివిజన్‌ వరిధిలోని సాయి నగర్‌ కాలనీ పలు అక్రమ నిర్మాణాలు పార్కులు కబ్జాలు, బస్‌ డిపో ఎదురుగా రెండు షెడ్లు క్యూ మాల్‌ వెనుక ఓ షెడ్డు అలాగే బస్‌ డిపో పక్కన భారీ షెడ్డు నిర్మాణం చేపడుతున్నారు. ఇంత భారీ ఎత్తున అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నప్పటికీ కమిషనర్‌, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం చూస్తుంటె మొఖం మీద ఉమ్మేసినా పర్వాలేదు డబ్బులిస్తే చాలు అనే రీతిగా మారింది వీరి వ్యవహారం. పలు కాలనీలలో అనుమతులు సరిగ్గా లేని నిర్మాణాలు ఎలాంటి సెట్‌ బ్యాక్‌లు లేకుండా ర్యాంప్‌లు రోడ్డుపైకి వచ్చి వాహనదారులకు నరకంగా మారింది.గత ప్రభుత్వ హయాంలో మాజీ మున్సిపల్‌ మంత్రి కేటీర్‌ రాష్ట్రంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగిన కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పలు సందర్భాలలో చెప్పారు. కానీ ఇక్కడ జరిగే ప్రతీ అక్రమ నిర్మాణానికి మేయర్‌ జక్కా వెంకట్‌ రెడ్డి అతని సహచర కార్పొరేటర్ల కు ప్రతీ నిర్మాణానికి ఓ రేటు ఉంటుంది.ఇక అతి ముఖ్యమైనది అయితే మంత్రి కేటీర్‌ పేషీ నుండి ఓఒఎస్‌ డి సహకారం అందించాడని బహటంగానే చెప్పుకున్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ఏ నిర్మాణం చేపట్టిన అనుమతులు తప్పనిసరి కానీ అక్రమార్ములు నిబంధనలను తుంగలో తొక్కి మేయర్‌, ప్రజా ప్రతినిధుల అండదండలతో అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. దీంతో మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడుతున్నా చర్యలు తీసుకున్న పాపాన పోలేదు. దీనితో మున్సిపల్‌ శాఖ బ్రష్టు పట్టిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి.పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో జరుగుతున్న అక్రమ భవనాలు, అక్రమ షెడ్ల నిర్మాణాలపైన ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం మేయర్‌, ప్రజా ప్రతినిధులు మరియు అధికారులపై చర్యలు తీసుకుంటారని స్థానికులు, విపక్షాలు ఆశాభావం వ్యక్తపరుస్తున్నారు.
పీర్జాదిగూడ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ బీఆర్‌ఎస్‌ మేయర్‌, ప్రజాప్రతినిధుల కనుసైగల్లో అవినీతి అక్రమాలకు మారుపేరుగా మారిందని,భూ కబ్జాలు, అవినీతి, అక్రమ నిర్మాణాలపై చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, ముఖ్య మంత్రి రేవంత్‌ రెడ్డి సహకారం తో పీర్జాదిగూడ మున్సిపల్‌ ను ఆదర్శవంతంగా అభివృద్ధి పథంలోకి తెస్తామని పట్టణ అధ్యక్షులు తుంగతుర్తి రవి తెలిపారు.
` తుంగతుర్తి రవి, కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు
పీర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు