Sunday, May 12, 2024

వైద్య రంగంలోనే అద్భుతం

తప్పక చదవండి
  • తెగిన బాలుడి తలను అతికించిన వైద్యులు
  • ఇజ్రాయెల్‌ వైద్యుల ఘనత

ఇజ్రాయిల్‌ వైద్యులు ప్రపంచంలోనే అసాధారణ, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి కారుప్రమాదంలో తెగిపోయిన బాలుడి తలను అతికించారు. సులేమాన్‌ హసన్‌ అనే బాలుడు సైకిల్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో వెన్నుపూస, మెడ నుంచి అతడి తల భాగం విడిపోయింది. దీన్ని మెడికల్‌ భాషలో ‘బైలేటరల్‌ అట్లాంటో ఆక్సీపిటల్‌ జాయింట్‌ డిస్‌లొకేషన్‌’ అని పిలుస్తారు.
వైద్య రంగంలోనే అద్భుతం చోటుచేసుకొన్నది. ఇజ్రాయిల్‌ వైద్యులు ప్రపంచంలోనే అసాధారణ, అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి కారుప్రమాదంలో తెగిపోయిన బాలుడి తలను అతికించారు. సులేమాన్‌ హసన్‌ అనే బాలుడు సైకిల్‌పై వెళ్తుండగా కారు ఢీకొట్టడంతో వెన్నుపూస, మెడ నుంచి అతడి తల భాగం విడిపోయింది. దీన్ని మెడికల్‌ భాషలో ‘బైలేటరల్‌ అట్లాంటో ఆక్సీపిటల్‌ జాయింట్‌ డిస్‌లొకేషన్‌’ అని పిలుస్తారు.
వెంటనే బాలుడిని కుటుంబ సభ్యులు విమానంలో హదస్సా మెడికల్‌ సెంటర్‌కు తరలించారు. ఆ బాలుడు 50 శాతం మాత్రమే బతికే చాన్స్‌ ఉందని చెప్పిన వైద్యులు ఈ కేసును సవాల్‌గా స్వీకరించారు. డాక్టర్‌ ఓహాద్‌ ఇనావ్‌ పర్యవేక్షణలో వైద్య బృందం, కొన్ని గంటలపాటు శ్రమించి క్లిష్టమైన శస్త్ర చికిత్స చేశారు. విజయవంతంగా హసన్‌ తల, వెన్నెముకను అతికించారు. ఈ చికిత్స జూన్‌లో జరగ్గా వివరాలను ఈ నెలలో వెల్లడించారు. హసన్‌ ఇటీవలే దవాఖాననుంచి డిశ్చార్జి అయ్యాడు. అతడి ఆరోగ్య పరిస్థితిని తరుచూ పర్యవేక్షిస్తుంటామని వైద్యులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు