Saturday, July 27, 2024

పోయాం..మోసం

తప్పక చదవండి
  • బోర్డు తిప్పేసిన కనకదుర్గ చిట్‌ ఫండ్స్‌ సంస్థ
  • చిట్టి డబ్బులడిగితే చీరేస్తా అని బెదిరిస్తున్న సంస్థ యజమాని
  • వికారాబాద్‌ పట్టణంలోని చిట్‌ ఫండ్‌ సంస్థలో వెలుగుచూసిన తతంగం..
  • జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేసిన బాధితులు..
    వికారాబాద్ : పట్టణంలోని పలు చిట్‌ ఫండ్‌ సంస్థలు మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఘరానా మోసాలకు పాల్పడుతున్నాయని,ప్రైవేట్‌ చిట్‌ ఫండ్‌ సంస్థల పట్ల ప్రజలు జాగ్రత్తలు వహించాలని గతంలో అనేక మార్లు ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రిక కథనాలను ప్రచురించింది. అంతేకాకుండా చీటింగ్‌ కు తెరలేపిన చిట్‌ ఫండ్‌ సంస్థల గుర్తు రట్టు చేసిన సంగతి నిజమే. అయినా కూడా సామాన్య ప్రజలు చిట్‌ ఫండ్‌ సంస్థల నిర్వాహకుల మాయమాటలు నమ్మి మోసపోతూనే ఉన్నారు. తాజాగా వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో కనకదుర్గ ప్రైవేట్‌ చిట్‌ ఫండ్‌ సంస్థ గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల నుండి కోట్లలో డబ్బులు డిపాజిట్‌ చేయించుకొని ఇప్పుడు డబ్బులు అడుగుతే బెదిరింపులకు పాల్పడుతున్నారు. కనకదుర్గ చిట్‌ ఫండ్స్‌ సంస్థ యజమాని వరంగల్‌ పట్టణంలో కనకదుర్గ చిట్‌ ఫండ్స్‌ సమీపంలో రౌడీలను పెట్టి డబ్బులడిగిన వారిని బూతు మాటలు తిడుతూ ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ బెదిరింపులకు పాల్పడినట్టు బాధితులు వాపోయారు..కేసులు నాకు కొత్త కాదు, నాకు ఎదురు రావద్దు. వచ్చినప్పుడు ఇస్తా తీసుకొని వెళ్ళిపోవాలి ఎక్కువగా మాట్లాడితే అంతు చూస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నట్టు బాధితులు అవేదన వ్యక్తం చేస్తు శుక్రవారం వికారాబాద్‌ జిల్లా జిల్లా ఎస్పీకి, కలెక్టర్‌ కు పిర్యాదు చేశారు .లక్షల రూపాయలు డిపాజిట్‌ చేసి నెలల వారీగా చిట్టీలు పోగేసుకునీ చిట్టి డబ్బులు వస్తే కుటుంబ అవసరాలకు ఉపయోగపడతాయని చిట్టీలు వేస్తే చిట్టి యజమానులు నట్టేట ముంచి మా డబ్బులతో రియల్‌ ఎస్టేట్‌ దందా చేసుకొని కోటీశ్వరులు అవుతున్నారు.అయినా కూడా వాళ్ళ పై చర్యలు తీసుకునే నాధుడే కరువయ్యాడనీ వాపోయారు. కనకదుర్గ చిట్‌ ఫండ్స్‌ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు ఫిర్యాదులో కోరారు.
    చిట్టీలు వేసి చిట్‌ ఫండ్‌ సంస్థల చుట్టూ చెక్కర్లు…
    పలు ప్రైవేట్‌ చెక్‌ ఫండ్‌ సంస్థ నిర్వాహకుల మాటలు నమ్మి చిట్టీలు వేసుకున్న సామాన్య ప్రజలకు సమయానికి చిట్టి డబ్బులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ మోసాలకు పాల్పడగా ఎవరికి చెప్పుకోవాలో తెలియక, ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మొత్తానికి డబ్బులు రావేమోనన్న అపోహతో చిట్ఫండ్‌ సంస్థల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు. కొందరికి చెక్కులు ఇచ్చినట్టే ఇచ్చి చెక్కు డిపాజిట్‌ చేసే రోజు రాగానే అపీసులో చెక్కు వాపసు చేసి డబ్బులు తీసుకెళ్లండి అని కార్యాలయానికి రప్పించి వచ్చేవారం పలానా రోజున ఇస్తామని చెప్పి కస్టమర్లకు చుక్కలు చూపెడుతున్నారు. వికారాబాద్‌ పట్టణంలో ఇలాంటి చిట్‌ ఫండ్‌ సంస్థలు మరెన్నో ఉన్నాయి. మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే తక్షణమే పోలీస్‌ వారికి ఫిర్యాదు చేస్తే మంచిది.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు