Friday, May 17, 2024

ప్రభుత్వ ఉపాధ్యాయుల కుమ్ములాట

తప్పక చదవండి
  • భూమి తగదాలలో ఉపాధ్యాయుడిపై మరొక ఉపాధ్యాయుడు దాడి..
  • రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం జిల్లాలో ఉద్యోగం..
  • రియల్టర్లుగా మారిన ప్రభుత్వ ఉపాధ్యాయులు..
  • రంగంలోకి దిగిన ఉపాధ్యాయుల సంఘ నాయకులు..
  • పోలీస్‌ స్టేషన్‌లోనే సెటిల్మెంట్‌కు తెరలేపిన వైనం..
    పాఠాలు చెప్పే బడిపంతులు భూమి విషయంలో గొడవ పడి బజారున పడ్డారు. అందరూ సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన వారే కాగా, దాడి చేసిన ఉపాధ్యాయుడిని కాపాడేందుకు ఉపాధ్యాయుల సంఘ నాయకులు రంగ ప్రవేశం చేసి పోలీస్‌ స్టేషన్లోనే సెటిల్మెంట్ల కు తెర లేపారు. దాడి చేసుకున్న ఉపాధ్యాయులకు సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారుల అండదండలు మెండుగా ఉన్నాయని తెలుస్తుంది. ఆ పరిచయం పొంది జిల్లాకు దగ్గరలో పాఠశాలల్లో పోస్టింగులు తీసుకొని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని తోటి ఉపాధ్యాయులు బహిరంగంగానే చెప్తున్నారు.
    సూర్యాపేట : భూతగాదాల నేపథ్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు పై మరొక ఉపాధ్యాయుడు దాడి చేసిన సంఘటన గురువారం ఉదయం మండల పరిధిలోని కుడ కుడ శివారులో చోటుచేసుకుంది.స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుడ కుడ శివారులో (309 సర్వే) 8 మంది కలిసి 2 ఎకరాల 6 గుంటలు భూమి కొనుగోలు చేశారని పోలీసులు తెలిపారు.సూర్యాపేట పట్టణానికి చెందిన నట్టే సృజన్‌ కుమార్‌ కు (ప్రభుత్వ ఉపాధ్యాయుడు) చెందిన 20 గుంటల భూమి పక్కనే సూర్యాపేటకు చెందిన వల్లెం శంకర్‌ ప్రసాద్‌ (ప్రభుత్వ ఉపాధ్యాయుడు) కు కొంత భూమి ఉంది. వీరిద్దరి భూమి పక్కన ఉన్న మరో వ్యక్తి, తన భూమిలో హద్దురాలను ఏర్పాటు చేసుకుంటుండగా, సృజన్‌ కుమార్‌ తో పాటు వల్లెం శంకర్‌ ప్రసాద్‌ కు సమాచారం ఇచ్చారు. హద్దురాలను సరి చేసుకుంటుండగా,ఒకరి మీద ఒకరు వాగ్వాదానికి దిగి, క్రమంలో సృజన్‌ పై, శంకర్‌ ప్రసాద్‌ తన అనుచరుడు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, పాల సైదులు తో కలిసి బండరాయితో దాడి చేశాడని పోలీస్‌ లు వెల్లడిరచారు. అనంతరం గాయాలైన సృజన్‌ తన భార్య జ్యోతి (ప్రభుత్వ ఉపాధ్యాయురాలు) కి సమాచారం ఇవ్వడంతో, సంఘటన స్థలానికి వచ్చిన జ్యోతి పై కూడా భౌతికంగా దాడి చేశారని పోలీస్‌ లు తెలిపారు.నట్టే సృజన్‌ కుమార్‌ ఫిర్యాదు మేరకు చివ్వెంల ఎస్‌ఐ టు పసుపులేటి మధు నాయుడు కేసు నమోదు చేసి,దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు