Tuesday, May 7, 2024

తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం మీడియా విభాగంజనగామ జిల్లా అధ్యక్షుడిగా మంచికట్ల రాజేష్..

తప్పక చదవండి
  • ఉపాధ్యక్షుడిగా దీకొండ హరీష్..
  • నియామకాలు చేపట్టిన రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు..
  • వివరాలు అందించిన రాష్ట్ర మీడియా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు
    భూస రమేష్ యాదవ్..

జనగామ : తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం మీడియా వింగ్ జనగామ జిల్లా కమిటీని రాష్ట్ర అధ్యక్షులు గంధం రాములు ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది.. ఇందులో జనగామ జిల్లా అధ్యక్షులుగా మంచి కంట్ల రాజేష్, జిల్లా ఉపాధ్యక్షుడిగా దీకొండ హరీష్ నియమించడం జరిగింది. దీనికి సంబంధించిన అధికార ప్రతిని జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేతుల మీదుగా భారత పరిశ్రమల అధ్యక్షుడు వేదాంతం శ్రీకాంత్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ ఉద్యోగ సంఘం నాయకులు, జర్నలిస్టులు పాల్గొనడం జరిగింది. జనగామ జిల్లా అధ్యక్షుడు రాజేష్, జిల్లా ఉపాఅధ్యక్షులు దీకొండ హరీశ్ మాట్లాడుతూ.. నా మీద నమ్మకంతో ఇంత పెద్ద పదవిని కట్టబెట్టిన గంధం రాములన్నకు సహకరించిన నేషనల్ వింగ్ ప్రెసిడెంట్ వేదాంతం శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూస రమేష్ కు కృతజ్ఞతలు తెలుపుతూ జనగామ జిల్లాలో జర్నలిస్టులకు సంబంధించిన పథకాలు గాని, వారి సమస్యలు గానీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ చొరవతో పరిష్కరిస్తానని మీడియా పరంగా చూసుకుంటూ ప్రైవేటు ఉద్యోగుల అభివృద్ధి కూడా తోడ్పడుతూ వారి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కార దిశగా తోడ్పడుతానని.. జనగామ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ, వెనకబడిన జిల్లా, జిల్లా అభివృద్ధి ముందుకు సాగాలంటే ప్రభుత్వ ఉద్యోగులతో సహా, ప్రైవేటు ఉద్యోగుల పాత్ర ఎంతో ఉంటుంది.. ప్రైవేట్ ఉద్యోగుల హక్కులకై వారి సమస్యలను పరిష్కరిస్తూ.. తెలంగాణ ప్రైవేటు ఉద్యోగ సంఘం ముందు ఉంటుందని అందులో నేను ముందుండి పోరాడుతానని అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జిల్లా కమిటీకి ఎన్ని ఎన్నుకోబడిన సభ్యులను సన్మానించడం జరిగింది.. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ.. మీరు జిల్లా కమిటీకి ఎన్నిక కావడం శుభ పరిణామం అని, జిల్లాలో జర్నలిస్టుల సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకు రావాలని ఎటువంటి సమస్య అయినా పరిష్కార దిశగా నా సాయ శక్తులా నేను కృషి చేస్తానని జర్నలిస్టుల అభివృద్ధికి సహకరిస్తానని అన్నారు.. తదనంతరం జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రాజేష్, జిల్లా ఉఫాధ్యక్షుడు దీకొండ హరీష్ ను జిల్లా కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారికి రాష్ట్ర కమిటీ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు