Saturday, May 18, 2024

మలయాళ నటికి లైంగిక వేధింపులు..

తప్పక చదవండి
  • మెయిల్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు అందిన నటి దివ్య ప్రభ

ప్రముఖ మలయాళ నటి దివ్య ప్రభ కు చేదు అనుభవం ఎదురైంది. విమానంలో ఆమె లైంగిక వేధింపులకు గురైంది. దివ్య.. మంగళవారం ముంబై నుంచి కొచ్చికి ఎయిర్‌ ఇండియా AI 681 విమానంలో ప్రయాణించింది. ఆ సమయంలో పక్క సీటులో ఉన్న వ్యక్తి తనను వేధింపులకు గురి చేసినట్లు నటి వెల్లడించింది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ‘మద్యం మత్తులో ఓ వ్యక్తి 12సీ సీటులో కూర్చున్నాడు. తర్వాత తన సీటును 12బీకి మార్చుకుని, నా పక్క సీటు (12ఏ)లోకి చేరాడు. విండో సీటు కోసం నాతో వాగ్వాదానికి దిగాడు. నన్ను భౌతికంగా తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. నేను ఈ విషయాన్ని వెంటనే ఎయిర్ హోస్టెస్‌కు దృష్టికి తీసుకెళ్లాను. దీంతో వారు విమానం టేకాఫ్‌కు కొద్ది సేపటికి ముందు నా సీటును మార్చారు. కానీ, అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఈ విషయాన్ని విమానాశ్రయ సిబ్బంది, ఎయిర్ ఇండియా ఆఫీస్ సిబ్బందికి చెప్పాను. దాంతో పోలీసుల సాయం పొందాలని వారు నాకు సూచించారు. దీంతో నేను ఈ విషయంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయవలసిందిగా కేరళ పోలీసులకు ఈ మెయిల్‌ ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశాను’ అని నటి వివరించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు