Tuesday, May 7, 2024

జపాన్‌లో వాయిదా పడ్డ లూనార్‌ మిషన్‌ ప్రయోగం ..

తప్పక చదవండి
  • ప్రతికూల వాతావరణమే కారణం
  • జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్ చేయడమే లక్ష్యం
  • జపాన్ చేపట్టిన మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదా..
    జాబిల్లి ఉపరితలంపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ ల్యాండ్ చేయడమే లక్ష్యంగా జపాన్ చేపట్టిన మూన్ ల్యాండర్ రాకెట్ ప్రయోగం వాయిదాపడింది. కగోషిమా ప్రిఫెక్చర్‌లోని జాక్సా టనేగషిమా స్పేస్‌ సెంటర్‌లో ఉన్న యోషినోబు లాంచ్‌ కాంప్లెక్స్‌ నుంచి సోమవారం ఉదయం 9.26 గంటలకు హెచ్2-ఏ రాకెట్‌ను ప్రయోగించాల్సి ఉన్నది. అయితే ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయోగాన్ని వాయిదావేస్తున్నట్లు జపాన్‌ అంతరిక్ష పరిశోధనా సంస్థ జాక్సా వెల్లడించింది. కాగా, ఈ ప్రయోగం పోస్ట్‌పోన్‌ కావడం ఇది మూడోసారి. నాసా యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ సహకారంతో చంద్రునిపై పరిశోధనలు జరపడానికి స్మార్ట్ ల్యాండర్ లేదా స్లిమ్, లూనార్ ప్రోబ్‌ను జపాన్ అభివృద్ధి చేసింది. మిషన్ విజయవంతమైతే చంద్రునిపై ల్యాండర్‌ను సాఫ్ట్‌ లాండ్‌ చేసిన ఐదో దేశంగా జపాన్ అవతరించనుంది. అయితే ప్రయోగించిన 3-4 నెలల తర్వాత ఈ స్పేస్‌ క్రాఫ్ట్‌ చంద్రుడి కక్ష్యలోకి చేరనుంది. కాగా, చంద్రయాన్-3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధృవ ప్రాంతంలో విజయవంతంగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు