Wednesday, April 24, 2024

తిరుమలలో చిక్కిన మరో చిరుత..

తప్పక చదవండి

తిరుమలలో మరో చిరుతపులి చిక్కింది. అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత బంధించారు. దీంతో ఇప్పటి వరకు నాలుగు చిరుతలను బందించినట్లయింది. దీనిని పట్టుకోవడానికి టీటీడీ అటవీశాఖ అధికారులు వారం రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. చిరుత రోజూ బోను వరకు వచ్చి వెనక్కివెళ్తున్నట్లు అక్కడ ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల్లో గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి అది బోను చిక్కిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.

తిరుమల నడక మార్గంలో చిన్నారి లక్షితను చిరుత పులి దాడి చేసి చంపిన ఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం అప్రమత్తమైంది. మెట్లదారి భక్తుల భద్రతపై దృష్టిసారించింది. ఏడో మైలు నుంచి నరసింహస్వామి ఆలయం వరకు హైఅలర్ట్ జోన్‌గా ప్రకటించింది. ఈ క్రమంలో చిరుతలను పట్టుకోవడానికి చర్యలు తీసుకున్నది. ఇందులోభాగంగా ఈనెల 14, 17 తేదీల్లో రెండు చిరుతలు బోనులో చిక్కిన విషయం తెలిసిందే. అంతకు ముందే ఓ చిరుత పిల్ల పట్టుబడింది. తాజాగా మరో చిరుత బోనులో చిక్కడంతో ఈ సంఖ్య నాలుగుకు చేరింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు