Tuesday, July 16, 2024

జగన్‌ను సాగనంపుదాం రండి

తప్పక చదవండి
  • అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం
  • ప్రజాకోర్టులో వైకాపాను శిక్షిద్దాం
  • వైకాపాకు అబ్యర్థులు కూడా దొరకడం లేదు
  • పీలేరు సభలో చంద్రబాబు పిలుపు

తిరుపతి : జగన్‌ అవినీతి అక్రమాలకతో ఎపి పూర్తిగా నష్టపోయిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకోర్టులో వైకాపాను శిక్షించే సమయం దగ్గరపడిరదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే జగన్‌ ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. ఆయనకు అభ్యర్థులు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. పీలేరులో తెదేపా నిర్వహించిన ’రా.. కదలిరా’ సభలో చంద్రబాబు ప్రసంగించారు. వైకాపా ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. ప్రజలు కసినంతా ఎన్నికల సమయంలో జగన్‌పై చూపించాలి. వచ్చేది యుద్ధం.. దానికి మేం సిద్ధంగా ఉన్నాం. కురుక్షేత్రంలో గెలుపు తెదేపా, జనసేనదే. ఎన్నికల అనంతరం వైకాపా జెండా పీకేయడం ఖాయం అన్నారు. పీలేరు గర్జన రాష్ట్రం మొత్తం వినిపించాలి. జగన్‌ రాయలసీమ ద్రోహి. గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత తెదేపాదేనని అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకుంటే రాయలసీమ సస్యశ్యామలమవుతుంది. అబద్దాల్లో జగన్‌ పీహెచ్‌డీ చేశారు. రూ.10 ఇచ్చి రూ.100 దోచుకోవడమే ఆయన పాలసీ. ఇలాంటి జలగ మనకు అవసరమా? బటన్‌ నొక్కుడులో ఎంత దోచుకున్నారో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు అల్లాడిపోతున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా పీలేరులో రా..కదలి రా బహిరంగ సభలోనూ జగన్‌పై చంద్రబాబు మరోసారి నిప్పులు చెరిగారు. విశాఖలో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభను ఇక్కడ ప్రస్తావిస్తూ.. అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ప్లెక్సీలు సిద్ధమని పెడుతున్నారని మండిపడ్డారు. జగన్‌ను ఓడిరచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్‌కు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. జగన్‌ను ఇంటికి పంపడానికి యువత, రైతులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగన్‌ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైఎస్సార్‌ పార్టీ జెండా పీకేయడం తప్పదని స్పష్టం చేశారు. ‘యుద్ధం ప్రారంభమైంది. యుద్దానికి మేము సిద్ధం‘ అని తేల్చిచెప్పారు. కురుక్షేత్ర ధర్మ యుద్దానికి జనసేన, టీడీపీ సిద్ధంగా ఉన్నాయన్నారు. 2019లో ముద్దులు పెట్టి బుగ్గలు నొక్కి మోసం చేశారన్నారు. ఒక్క అభివృద్ధి లేదు, ప్రాజెక్టు లేదు, పరిశ్రమ లేదని మండిపడ్డారు.‘నేను రాయలసీమ బిడ్డను, నాలో ఉన్నది రాయలసీమ రక్తం. రాయలసీమను రతనాల సీమ చేయాలంటే ఏం చేయాలో అన్ని ఆలోచన చేశాను. హంద్రీనివాపై మేము రూ.4200 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్‌ ఒక రూపాయి కూడా పెట్టలేదు. పీలేరు పుంగనూరులకు నీళ్లు రాలేదు. గాలేరు నగిరిపై రూ.1550 కోట్లు మేము ఖర్చు పెట్టాం అని చంద్రబాబు వెల్లడిరచారు.ఇదిలావుంటే పీలేరులో చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో భద్రతా వైఫల్యం తలెత్తింది. డీ జోన్లోకి జనం వచ్చారు. దీంతో ఎన్‌ఎస్‌జీ కమెండోలు అప్రమత్తమయ్యారు. చంద్రబాబు చుట్టూ చేరిపోయారు. చుట్టుపక్కల జనం నిండిపోవడంతో చంద్రబాబు భద్రతా సిబ్బంది పూర్తిగా అప్రమత్తమైంది. పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారు. పీలేరు సభా ప్రాంగణం జనసంద్రం అయింది. రోడ్లన్నీ జనంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి చెప్పినా జనం వెనక్కు వెళ్ళలేదు. తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని, జాగ్రత్తగా ఉండండి అంటూ చంద్రబాబు పలుమార్లు హెచ్చరించారు. సభకు జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. సభా వేదిక వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు దూసుకువచ్చారు. రక్షణగా కట్టిన బారికేడ్లను దాటుకుని వేదిక వద్దకు వచ్చారు. సభా వేదిక ముందు డి సర్కిల్‌లోకి వేల మంది కార్యకర్తలు దూసుకొచ్చారు. సీఎం సీఎం అంటూ సభా ప్రాంగణం స్లోగన్స్‌తో హోరెత్తింది. కార్యకర్తలను అదుపుచేసేందుకు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో భద్రతా సిబ్బంది కంగారుపడిరది. కార్యకర్తలను అదుపు చేయలేక ఇబ్బంది పడ్దారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు