Friday, May 17, 2024

స్వదేశానికి తిరిగొచ్చిన కోహ్లీ

తప్పక చదవండి

ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియా ఇప్పటికే ఆతిథ్య జట్టుతో టీ20, వన్డే సిరీస్‌లను ముగించింది. ఇప్పుడు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే ఈ టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభానికి ముందు, ఒక షాకింగ్‌ న్యూస్‌ బయటకు వచ్చింది. టీమిండియా రన్‌ మెషిన్‌ విరాట్‌ కోహ్లీ హఠాత్తుగా దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ఇటీవల ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌ల నుంచి కింగ్‌ కోహ్లీకి విశ్రాంతి కల్పించారు. అయితే టెస్టు సిరీస్‌కు మాత్రం జట్టులోకి ఎంపికయ్యాడు. సఫారీలతో టెస్ట్‌ సిరీస్‌ కోసం కొన్ని రోజుల క్రితమే అక్కడకు వెళ్లి ప్రాక్టీస్‌ కూడా ప్రారంభించాడు విరాట్‌. అయితే సిరీస్‌ ప్రారంభానికి ముందు విరాట్‌ కోహ్లీ స్వదేశానికి తిరిగి వచ్చాడు. దీంతో టెస్టు సిరీస్‌కు ముందు జరిగే మూడు రోజుల వార్మప్‌ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో ఉండడం లేదు. అయితే కోహ్లీ రాకకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఫ్యామిలీలో ఎమర్జెన్సీ పరిస్థితుల కారణంగానే విరాట్‌ స్వదేశానికి తిరిగొచ్చాడని తెలుస్తోంది. ఇందు కోసం భారత్‌కు తిరిగి వచ్చే ముందు, కోహ్లీ బీసీసీఐ అనుమతి తీసుకున్నాడు. అయితే బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం విరాట్‌ కోహ్లీపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని తెలుస్తోంది. విరాట్‌ కోహ్లీ దక్షిణాఫ్రికా టెస్ట్‌ సిరీస్‌కు అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. అయితే మొదటి టెస్ట్‌ ఆడడం అనుమానమేనంటున్నారు. 3 రోజుల క్రితమే విరాట్‌ కోహ్లి ముంబైకి తిరిగొచ్చాడని, శుక్రవారం మళ్లీ దక్షిణాఫ్రికా వెళ్లనున్నాడని అంటున్నారు. అయితే ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా విరాట్‌ కోహ్లీ భారత్‌కు తిరిగి వచ్చాడంటున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో విరాట్‌ కోహ్లీ కీలక పాత్ర పోషించనున్నాడు. ఎందుకంటే దక్షిణాఫ్రికాలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ రికార్డు చాలా దారుణంగా ఉంది. కాబట్టి బ్యాటింగ్‌ విభాగంలో విరాట్‌పై మరింత బాధ్యత ఉంది. విరాట్‌ దక్షిణాఫ్రికాలో 51 ఓవర్ల సగటుతో 719 పరుగులు చేశాడు, ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికాలో ఇప్పటి వరకు ఏ టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలవలేదు. కాబట్టి విరాట్‌ కోహ్లీతో పాటు టీమిండియా సమష్ఠిగా రాణిస్తే ఈసారి భారత్‌ టెస్టు సిరీస్‌ కైవసం చేసుకుంటుందని చెప్పొచ్చు. అయితే మరో టీమిండియా ప్లేయర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ కూడా టెస్ట్‌ సిరీస్‌ కు దూరం కావడంతో టీమిండియా అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు