Tuesday, October 3, 2023

ఆందోళనలో ఆశావహులు

తప్పక చదవండి
  • మరో రెండు రోజుల్లో వెలువడనున్న ఎమ్మెల్యే అభ్యర్థుల మొదటి జాబితా
  • చివరి ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు
  • సిట్టింగులకే దాదాపుగా అవకాశాలు ఎక్కువ
  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కీలకంగా మారనున్న మంత్రి జగదీష్‌ రెడ్డి నివేది
  • సంబరాలు చేసుకుంటున్న సైదిరెడ్డి అభిమానులు మరియు కార్యకర్తలు

హుజూర్‌ నగర్‌ : ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ఆయా రాజకీయ పార్టీలు తమ బలాలను బలహీనతలను సమీక్షించుకుంటున్నాయి. అధికార పార్టీ బి.ఆర్‌.ఎస్‌ కేసీఆర్‌ నాయకత్వంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అందరికంటే ముందుగానే అభ్యర్థుల ఎంపిక చేసే పనిలో మునిగిపోయారు కేసీఆర్‌ సీఎంగా తన విధులు తాను నిర్వహిస్తూనే మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నిరంతర పర్యవేక్షణ ఉంచి, సర్వేల ద్వారా వారి పనితీరును సమీక్షిస్తుంటారు. సర్వేలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో అతి త్వరలో రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల జాబితాను తయారు చేసినట్లుగా సమాచారం. ఒకటి రెండు రోజుల్లో మొదటి జాబితాను విడుదల చేయనున్నారని, ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున ఇంత త్వరగా అభ్యర్థుల జాబితా ఇవ్వడం ద్వారా అభ్యర్థికి ప్రజల్లోకి వెళ్లడానికి, ప్రచారం చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది. అదేవిధంగా టికెట్‌ ఆశించి టికెట్‌ దక్కని ఆశావహులను బుజ్జగించడానికి సమయం కావాల్సి ఉంటుంది కనుక ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఆశావహులను బుజ్జగించి వేరే పార్టీలో చేరకుండా చూడాలని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారు. మన హుజూర్నగర్‌ నియోజకవర్గ విషయానికొస్తే ఇక్కడ దాదాపుగా శానంపూడి సైదిరెడ్డి వైపే సీఎం కేసీఆర్‌ మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అతి తక్కువ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడైన సైదిరెడ్డి తక్కువ కాలంలో ప్రజలలో ఎక్కువ ఆదరణ పొందడంతో అందులోనూ, హుజూర్‌ నగర్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థి అయినటువంటి పీసీసీ చీఫ్‌ మరియు ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కావడం వలన ఇప్పటికిప్పుడు అభ్యర్థిని మార్చిన అంత ఆదరణ కలిగిన వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఎవరూ లేరు అందులోనూ సైదిరెడ్డికి మంత్రి జగదీశ్‌ రెడ్డి మరియు కేటీఆర్‌ తో మంచి సాన్నిహిత్యం ఉండడం ఈ విషయాలన్నీ శానంపూడి సైదిరెడ్డికి కలసి వస్తున్నాయి.
అదృష్టం కూడా శానంపూడి సైదిరెడ్డి వైపు
తెలంగాణలో చివరిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ పార్టీ తరఫున బరిలోకి దిగిన శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి ఆయన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మీద పోటీ చేసి ఓడిపోయారు.శానంపూడి సైదిరెడ్డి అదృష్టం మరియు ప్రజలకు సేవ చేయాలనే కోరికే ఆయనను హుజూర్నగర్‌ ఎమ్మెల్యేగా మార్చాయి.అసెంబ్లీ ఎన్నిక తర్వాత జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి నల్గొండ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.దీంతో తన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.దీనితో హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది మొదటిసారి జరిగిన పొరపాట్లను తన రాజకీయ,రాజకీయతర అనుభవాన్ని సరి చేసుకుని ఉప ఎన్నికల్లో ప్రత్యర్థి అయిన ఉత్తమ్‌ పద్మావతి పై భారీ మెజారిటీతో గెలుపొందారు.
రాజకీయపరంగా వ్యూహాలు రచించడంలో సీఎం కేసీఆర్‌ దిట్ట అందుకు అణుగుణంగానే ఆయన ఆలోచనలు అడుగులు వేస్తుంటారు.తెలంగాణలో ఏకైక ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ ను అంతమొందించడానికి సీఎం కేసీఆర్‌ పావులు కదుపుతున్నారు. కాంగ్రెస్‌ లో బలమైన నాయకుడిగా మరియు ఎక్కువ అనుభవం కలిగిన నాయకుడు పీసీసీ చీఫ్‌ నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి ప్రత్యర్థిగా, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తుంది.రాజకీయంగా ఓనమాలు నేర్చుకుంటున్న శానంపూడి సైదిరెడ్డి ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత ప్రజలలో నమ్మకాన్ని పార్టీ పెద్దల్లో తన బలగాన్ని చూపించుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు.రాజకీయంగా ఎక్కువ అనుభవం లేకపోయినా ప్రజలలో నమ్మకాన్ని సొంతం చేసుకున్నారు. తన విధులు సక్రమంగా నిర్వహిస్తూ ఎటువంటి అవినీతి ఆరోపణ లేకపోవడం,ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను తన నియోజకవర్గంలో అందరికీ చేకూరేలా కృషి చేశారు.

నువ్వా నేనా….
ఎంతైనా హుజూర్‌ నగర్‌ నియోజకవర్గం ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడ్డాగా మారింది.ఈసారి జరిగే ఎన్నికల్లో బి ఆర్‌ ఎస్‌ తరఫున సైదిరెడ్డి, కాంగ్రెస్‌ తరపున ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రాజకీయపరంగా,అనుభవం పరంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి బలమైన నాయకుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చాలా సందర్భాల్లో హుజూర్‌ నగర్‌ నియోజకవర్గంలో తను ప్రచారం చేయకపోయినా గెలుపొందగలనని నాకు ఈ హుజూర్‌ నగర్‌ నియోజకవర్గం ఇంచు ఇంచు తెలుసని ఇక్కడ నాకు ప్రత్యర్థిగా సైదిరెడ్డి అయినా ఇంకెవరైనా పోటీ చేసిన గెలుపు తనదేనని కేవలం తెలియాల్సింది మెజారిటీ అని చాలా సందర్భాల్లో అన్నారు… అందువల్ల ఈసారి ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటుందని,ఈసారి జరిగే ఎన్నికలు కూడా ఉత్కంఠ భరితంగా ఉంటాయని,హుజూర్‌ నగర్‌ నియోజకవర్గ ప్రజలు ఎవరిని ఆదరిస్తారో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది.
కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఎన్నికలు ఐదు సంవత్సరములకు ఒకసారి జరుగుతాయి.డబ్బు కోసమో మద్యం కోసమో ఉచిత పథకాల కోసము ఆశపడి మీ మరియు మీ పిల్లల భవిష్యత్తులను అంధకారంలో పడవేయకుండా తమకు న్యాయం చేసే తమకు అండగా నిలబడే ప్రజల కోసం పనిచేసే నాయకులనే గెలిపించుకోవాలని కోరుచున్నారు…
ఆలోచించి ఓటు వేయండి మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోండి

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు