Friday, May 3, 2024

ఖాళీ స్థలాలు ఉన్నాయా..? తస్మాత్‌ జాగ్రత్త..

తప్పక చదవండి
  • అమీన్‌ పూర్‌ లో పెట్రేగి పోతున్న కబ్జాదారులు..
  • ఆన్‌లైన్‌లో కనపడని ఇంటి నెంబర్‌..
  • కోర్టులో కేసు వేయుటకు జిపిఏ చేసుకున్న వైనం..
  • కోర్టు ఆదేశాలతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన అమీన్‌ పూర్‌ పోలీసులు…
  • సి.డి.ఎం.ఏ కమిషనర్‌ సత్యనారాయణ దృష్టి సారిస్తే తప్ప చర్యలుండవా..

హైదరాబాద్ : రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవవుండదనే నానుడిని అక్షరాల అమలు చేస్తున్నారు. అమీన్‌ పూర్‌ మున్సిపల్‌ అధికారులు.. అక్రమమే ధ్యేయంగా అందిన కాడికి దండుకుంటూ తాము చెప్పింది శాసనం,రాసిందే రాజ్యాంగం అనే విధంగా తయారయ్యింది మున్సిపల్‌ అధికార యంత్రాంగం అందుకు ఉదాహరణనే శ్రీ వాణి నగర్‌ లో ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్‌ ఇచ్చి తాము ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్నామని రుజువు చేశారు.

ఆ గట్టునుంటావా నాగన్న… ఈ గట్టుకు వస్తావా నాగన్న… సినిమా పాటలు తలపించే విధంగా అమీన్‌ పూర్‌ లో రాజకీయాలు కొనసాగుతున్నాయి అనడంలో అనుమానం అక్కర్లేదు. మున్సిపాలిటీలో ప్రతిపక్ష నాయకుల అనుచరులు,వారి ఆస్తులే టార్గెట్గా అధికార పార్టీ నాయకులు పావులు కదుపుతున్నారా అంటే మున్సిపాలిటీలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే తెలిసిపోతుంది.శ్రీ వాణి నగర్‌ లోని సర్వే నెంబర్‌ 171 లో మహేష్‌ గౌడ్‌ పరమేశ్వరయ్య వ్యక్తి వద్ద120 గజాల స్థలాన్ని 27.01.2023 తేదీన కొనుగోలు చేసి ఇంటి నిర్మాణ పనులు చేపట్టారు. అదే సమయంలో కేవలం కోర్టులో కేసు కోసమే తయారు చేసినటువంటి జిపిఏ పత్రాలతో ఓ వ్యక్తి ఈ స్థలం తనదేనంటూ రంగంలోకి దిగాడు..అతగాడికి మున్సిపల్‌ అధికారులు సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ.. ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్‌ సైతం మంజూరు చేశారు..ఖాళీ స్థలానికి ఇంటి నెంబర్‌ మంజూరు చేయడంలో మున్సిపల్‌ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులందాయనీ ఈ ప్రాంతంలో జోరుగా ప్రచారం ఉంది. చట్టాలను తుంగలో తొక్కుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న మున్సిపల్‌ అధికారుల పై ఉన్నత అధికారులు చర్యలు చేపడతారా…?అంటే ఈ మున్సిపాలిటీలో అది సాధ్యంగా కనిపించడం లేదు. మున్సిపల్‌ కమిషనర్‌ గా ఈ మధ్యనే పదవి బాధ్యతలు చేపట్టిన జ్యోతి రెడ్డి పారదర్శకంగా విధులు నిర్వహించి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు చేపడతారా అనేది వేచి చూడాలి…ఇక్కడి అధికార పార్టీ పెద్దలు ఆమె విధిని సక్రమంగా నిర్వహించేందుకు సహకరిస్తారా అనేది ప్రశ్నార్థకమే.కేవలం కోర్టు కేసు కోసమే సంగారెడ్డి సబ్‌ రిజిస్టర్‌ జిపిఎ చేస్తుండడం దీనికి సంకేతం.ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయంలో సరైన పత్రాలు లేకుండానే జిపిఎలు చేస్తున్నారు.. అమీన్‌ పూర్‌ మున్సిపాలిటీ సర్వేనెంబర్‌ 171 లో ఉన్న స్థలాన్ని కాజేసేందుకే సబ్‌ రిజిస్టర్‌ తో కలిసి అధికార పార్టీ నాయకులు పెద్ద స్కెచ్‌ వేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..కాంగ్రెస్‌ నాయకులు కాట శ్రీనివాస్‌ గౌడ్‌ అనుచరుడైనటువంటి సదరు ప్లాట్‌ యజమాని మహేష్‌ గౌడ్‌ ను ఫ్లాట్‌ విషయంలో ఇబ్బందులు సృష్టించి పార్టీ మారితే సమస్య పరిష్కారం అవుతుందని చెబుతున్నట్లు తెలుస్తుంది..ఫ్లాట్‌ యాజమాని కోర్టును ఆశ్రయించగా కోర్టు ఆదేశాలతో అమీన్‌ పూర్‌ పోలీసులు అక్రమాలకు పాల్పడే వ్యక్తుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..ఇదే విషయం పై సంబంధిత డాక్యుమెంట్‌ రైటర్‌ పజొత్తం రెడ్డి నీ వివరణ కోరగా కేవలం కోర్టు లో కేసు వేయుటకు డాక్యుమెంట్‌ కావాలని తనని ఆశ్రయించినట్లు తెలిపారు.. దీనిని బట్టి ఉద్దేశ్యపూర్వకంగానే కబ్జాకు పత్రాలు సృష్టించినట్లు తేట తెల్లమవుతోంది..భూ కబ్జాలకు పాల్పడేందుకు బోగస్‌ పత్రాలు సృష్టించిన ముఠా డాక్యుమెంట్‌ లో మహేష్‌ గౌడ్‌ కు చెందిన ఖాళీ స్థలానికి చూపించిన ఇంటి నెంబర్‌ మున్సిపాల్టీ వెబ్సైట్‌ లో ఆన్లైన్‌ లో కనపడక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది..ఆన్లైన్‌ లో లేని పిటి.ఐ.ఎన్‌ నెంబర్‌, ఇంటి నెంబర్‌ విషయం పై అమీన్‌ పూర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ జ్యోతి రెడ్డికి వివరణ కొరకు పలుమార్లు ఫోన్‌ చేసిన,వాట్సప్‌ లో వివరణ అడిగిన స్పందించలేదు..అమీన్‌ పూర్‌ లో కబ్జాలకు పాల్పడే వ్యక్తులు చేస్తున్న అక్రమాలు, అరాచకాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది..ఆదాబ్‌ హైదరాబాద్‌..మా అక్షరం అవినీతిపై అస్త్రం….

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు