Saturday, May 4, 2024

అధికారంలోకి వచ్చాక అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం

తప్పక చదవండి
  • లోకేశ్‌ను కలిసి సమస్యలు తెలిపిన బాధులు
  • దివ్యాంగుల చట్టం అమలుకు చర్య తీసుకుంటామని హావిూ
  • తూర్పులో కొనసాగిన లోకేశ్‌ యువగళం యాత్ర

కాకినాడ : టీడీపీ అధికారంలోకి వచ్చాక చట్టపరిధిలో అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయంచేస్తామని లోకేష్‌ హావిూ ఇచ్చారు. టీడీపీ యువనేత నారా లోకేష్‌ను అగ్రిగోల్డ్‌ బాధితులు కలిశారు. అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యలపై లోకేష్‌ స్పందిస్తూ సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు. ’మాటతప్పడం, మడప తిప్పడం జగన్మోహన్‌ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడం దురదృష్టకరం. లోకేష్‌ యువగళం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కాకినాడలో లోకేష్‌ను దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. జగన్‌ అధికారంలోకి వచ్చాక విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారన్నారు. దివ్యాంగులపై కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లలో ఒక్కరికి కూడా మూడు చక్రాల మోటార్‌ సైకిల్‌, పనిముట్లు ఇవ్వలేదన్నారు. స్వయం ఉపాధికి సంబంధించిన సబ్సిడీ లోన్లు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు విదేశీవిద్య, చంద్రన్న పెళ్లికానుక అమలు చేస్తామన్నారు. దివ్యాంగులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్‌ హెచ్చరించారు. పాదయాత్రలో భాగంగా కాకినాడలో లోకేష్‌ను దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. జగన్‌ అధికారంలోకి వచ్చాక విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారన్నారు. దివ్యాంగులపై కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత నాలుగున్నరేళ్లలో ఒక్కరికి కూడా మూడు చక్రాల మోటార్‌ సైకిల్‌, పనిముట్లు ఇవ్వలేదన్నారు. స్వయం ఉపాధికి సంబంధించిన సబ్సిడీ లోన్లు మంజూరు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల హక్కుల చట్టం అమలుకు చర్యలు తీసుకుంటామన్నారు. దివ్యాంగులకు విదేశీవిద్య, చంద్రన్న పెళ్లికానుక అమలు చేస్తామన్నారు. దివ్యాంగులపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని లోకేష్‌ హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు