ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాలలో సైంటిస్ట్ / ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రకటన విడుదల చేసింది. దరకాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.