ఐపీఎల్ పదహారో సీజన్ రేపటితో ముగియనుంది. మరో పది రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించనుంది. దాంతో, ఈ మెగా టోర్నమెంట్‌పై అందరి కళ్లు నిలిచాయి. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు ఇప్పటికే 17మందితో కూడిన బృందాన్ని ఎంపికచేశాయి. తాజాగా ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన తుది జట్టును వెల్లడించాడు. అనుభవజ్ఞుడైన డేవిడ్ వార్నర్ ను ఓపెనర్‌గా ఎంచుకున్నాడు. ఉస్మాన్ ఖవాజాకు జోడీగా వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించాలని ఈ మాజీ కెప్టెన్ అభిప్రాయపడ్డాడు.