Sunday, October 1, 2023

ముగ్గురు ఐపీఎస్ లకు డీజీలుగా పదోన్నతి..

తప్పక చదవండి
  • ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం..
  • సాధారణంగా 5గురు పోలీస్ ఉన్నతాధికారులు డీజీలుగా ఉంటారు..
  • ఖాళీగా ఉన్న డీజీ పోస్టులకు ముగ్గురికి హోదా కల్పిస్తూ ఆర్డర్స్..

రాష్ట్రంలోని ఐపీఏస్ ఆఫీస‌ర్లు సీవీ ఆనంద్, జితేంద‌ర్, రాజీవ్ ర‌త‌న్‌కు డీజీలుగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీవీ ఆనంద్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ సీపీగా కొన‌సాగుతున్నారు. రాజీవ్ ర‌త‌న్ పోలీస్ హౌజింగ్ కార్పొరేష‌న్ ఎండీ, జితేంద‌ర్ హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్ర‌ట‌రీగా కొన‌సాగుతున్నారు. సీవీ ఆనంద్, రాజీవ్ ర‌త‌న్ 1991 బ్యాచ్‌కు చెందిన వారు కాగా, జితేంద‌ర్ 1992 బ్యాచ్‌కు చెందిన వారు. గ‌తేడాది న‌వంబ‌ర్‌లో సీఐడీ డీజీ గోవింద్ సింగ్, డిసెంబ‌ర్‌లో మ‌హేంద‌ర్ రెడ్డి, రెండు నెల‌ల క్రితం ఉమేశ్ ప‌ద‌వీ విర‌మ‌ణ పొందారు. ఆ త‌ర్వాత మూడు డీజీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. సాధార‌ణంగా ఐదుగురు పోలీసు ఉన్న‌తాధికారులు డీజీ హోదాలో ఉంటారు. గ‌త కొన్ని నెల‌లుగా డీజీ పోస్టులు ఖాళీగా ఉండ‌టంతో ప్ర‌భుత్వం ముగ్గురికి డీజీ హోదా క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు