Sunday, May 19, 2024

నారసింహుడి సాక్షిగా నయా దందా..

తప్పక చదవండి
  • శుభమస్తు టౌన్షిప్ వారి ఇంద్రజాల మహేంద్రజాలం..

అక్రమ దందా చేసే వారి మెదడు కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది.. నిమిషానికో ఎత్తు.. గంటకో పైఎత్తు వేస్తూ.. అమాయకులను సులువుగా మోసం చేసేస్తూ ఉంటారు.. సులువుగా డబ్బు సంపాదించాలని ఆశపడే వారు వీరి వలలో ఈజీగా చిక్కుకుంటారు.. అలాంటి సరికొత్త మాయాజాలం తెలంగాణ తిరుమలగా ఘనతికెక్కిన యాదాద్రి సాక్షిగా వెలుగు చూసింది.. ఇక్కడ జరుగుతున్న తంతు చూస్తుంటే ఆశ్చర్యం కలుగక మానదు.. ఈ కథా కమామీషు ఏమిటో ఇప్పుడు చూద్దాం.. నారసింహుడు స్వయంభూగా కొలువైవున్న యాదాద్రిలో మార్వెల్ సిటీ 1, మార్వెల్ సిటీ 2 పేరిట నయా దందాకు తెరలేపారు శేఖర్ గౌడ్, విజయ్ కుమార్ లు.. హోటల్ షూట్ రూమ్స్ అంటూ అక్రమ వ్యాపారం మొదలు పెట్టారు.. 2019 నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండానే ప్రీ లాంచ్ పేరుతో ప్రాజెక్టు మొత్తం అమ్మేసిన ఘనులు వీరిద్దరు.. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్నేషనల్ హోటల్ పార్టనర్ తమతో చేతులు కలిపాడని మాయమాటలు చెబుతూ కమర్షియల్ షూట్ రూమ్స్ విత్ రెంటల్ ఇన్కమ్ అంటూ అమాయకులకు అంటగట్టే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.. వీరి మాయ మాటలు నమ్మి మొదట ఇన్వెస్ట్ చేసిన వారి పరిస్థితి ఏమిటి..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.. శుభమస్తు టౌన్ షిప్ కంపెనీలోని మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ గౌడ్, డైరెక్టర్ విజయ్ కుమార్ లు కలిసి ఇలాంటి అక్రమ దందా చేస్తూ ఇంకా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు..? ఏ.ఏ. ప్రాజెక్టులు చేపడుతున్నారు..? కాగా అధిక కమిషన్లు ఆశచూపి, ఏజంట్ల రిక్రూట్మెంట్ చేసుకుని అమాయకులకు గాలం వేస్తున్నారు.. ప్రీ లాంచ్ లో ఒక డిజైన్.. ఇప్పుడు మరో డిజైన్ చూపిస్తున్నారు..

హైదరాబాద్, హబ్సిగూడ, రోడ్ నెంబర్ : 8లో ఆకర్షణీయమైన కార్యాలయం ఏర్పాటు చేసుకుని.. తమ అక్రమ దందాను యథేచ్ఛగా సాగిస్తున్నారు.. శుభమస్తు టౌన్షిప్ ని అడ్డుపెట్టుకుని అశుభ కార్యక్రమాలు చేస్తూ.. మార్వెల్ 1, మార్వెల్ 2 పేరిట దోపిడీ పర్వానికి తెరలేపిన శేఖర్ గౌడ్, విజయ్ కుమార్ ల నిజ స్వరూపాన్ని, యాదాద్రీశుని సన్నిధిలో కమర్షియల్ రూమ్స్ విత్ రెంటల్ ఇన్కమ్ అంటూ సరికొత్త దందాను తెరమీదకు తీసుకువస్తున్న వీరి మాయల మరాఠీ గారడీలను ఆధారాలతో సహా వెలుగులోకి తీసుకుని రానుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు