Thursday, May 16, 2024

16 నుంచి హైదరాబాద్‌లో ఇండియన్‌ ప్రో బాక్సింగ్‌ లీగ్‌

తప్పక చదవండి

భారతదేశంలో ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ క్రీడలో ఒక సంచలనాత్మకంగా నిలిచిన ఇండియన ప్రో బాక్సింగ్‌ లీగ్‌ డిసెంబర్‌ 16 నుంచి ప్రారంభంకానుంది. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్ర ప్రో బాక్సింగ్‌ కౌన్సిల్‌, తెలంగాణ బాక్సింగ్‌ కౌన్సిల్‌ అధికారికంగా ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ లీగ్‌ ఇండియన్‌ బాక్సింగ్‌ కౌన్సిల్‌ , నేషనల్‌ కమీషన్‌ ఫర్‌ ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ ఇన్‌ ఇండియా అధికారికంగా గుర్తించింది. ఈ మ్యాచ్‌లు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో మరో మూడు రోజుల్లో మొదలుకానున్నాయి. ‘‘ రోడ్‌ టు ది ఇండియన్‌ ప్రో బాక్సింగ్‌ లీగ్‌ ‘‘ అనే గ్రాండ్‌ ప్రో బాక్సింగ్‌ ఫైట్‌ నైట్‌ ఈవెంట్‌ను ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ అసాధారణ ఈవెంట్‌ జిల్లా స్థాయి పోటీలు, మహిళల విభాగంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాతీయ టైటిల్‌ పోరుతో సహా పలు స్థాయిల పోటీల్లో అపూర్వమైన 10 ప్రో బౌట్‌లను ప్రదర్శిస్తుంది. అదనంగా, ఇది అగ్రశ్రేణి భారతీయ ప్రో బాక్సర్‌ శబరి జెతో అంతర్జాతీయ 10-రౌండ్‌ పోటీని కలిగి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. రాష్ట్రంలో క్రీడారంగంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. డబ్ల్యూబీసీ, డబ్ల్యూబీఏ, డబ్ల్యూబీఓ వంటి దిగ్గజాల నుంచి అంత ర్జాతీయ అనుబంధాలతో తెలంగాణ బాక్సర్లు ప్రపంచ గుర్తింపు పొందుతూ దూసుకుపోతు న్నారు. ఈ మేరకు ఇండియన్‌ బాక్సింగ్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ బ్రిగేడియర్‌ పీకేఎం రాజా తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ‘‘ భారతదేశంలోనే మొదటి రాష్ట్ర ప్రో బాక్సింగ్‌ కౌన్సిల్‌లో తెలంగాణ అగ్రగామిగా నిలిచినందుకు నేను సంతోషిస్తున్నాను. గత రెండు నెలలుగా, మేం ఇప్పటికే తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో దాదాపు 15 జిల్లాలను అనుబంధించాం. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో 33 జిల్లాలకు దీన్ని విస్తరించాలని చూస్తున్నాం’ అంటూ ప్రకటించాడు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు