Sunday, April 28, 2024

ప్రభుత్వ స్థలంలో నిర్మాణం చేస్తే తప్పేంటి..?

తప్పక చదవండి
  • సంగారెడ్డి జిల్లా డిపీఓ సురేష్ మోహన్ వింత పోకడ..
  • అక్రమాలకు అండగా నిలుస్తున్న పటేల్ గూడ కార్యదర్శికి
    ఉన్నతాధికారుల అండదండలు..
  • ప్రభుత్వ భూమి కబ్జాలో ఉన్నతాధికారుల వాటా ఎంత..?
  • బి.ఆర్.ఎస్. నాయకుడు చంద్రశేఖర్ కబంధహస్తాల్లో కోట్ల విలువైన ప్రభుత్వ స్థలం..
  • ప్రభుత్వ భూమి కబ్జాకు గురౌతున్నా తహశీల్దార్ దశరథ్ మౌనం దేనికి సంకేతం..
  • స్థానిక ఎమ్మెల్యే అండ దండలతో చంద్ర శేఖర్ కబ్జాలతో రెచ్చి పోతున్నాడా..?
  • సంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి సర్కార్ భూమిని కాపాడాలి..

ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే కబ్జాదారులకు సహకరిస్తున్నారు.. పాము తన పిల్లలను తానే తింటుందట.. అలా వుంది కొందరు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారం.. మరీ ముఖ్యంగా అమీన్ పూర్ మున్సిపాలిటీలో ప్రభుత్వ భూములకు రక్షణ అనేది లేకుండా పోయింది.. అక్రమ సంపాదనకు అలవాటుపడ్డ కొందరు ప్రభుత్వ ఉద్యోగులు, కబ్జాకోరుల నిర్వాకంతో భవిష్యత్తులో ప్రభుత్వ భూమి అనేది లేకుండా పోతుందనే ఆందోళనను పలువురు వ్యక్తం చేస్తున్నారు..

సంగారెడ్డి జిల్లా, అమీన్ పూర్ మండల కేంద్రంగా పటేల్ గూడ గ్రామ శివారులో ప్రభుత్వ భూమిలో పఠాన్ చెరువు ఎమ్మేల్యే అనుచరుడు యదేచ్ఛగా ప్రభుత్వ భూమి కబ్జాకు తేర లేపడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.. అక్రమాలకు అండగా నిలుస్తున్న పటేల్ గూడ గ్రామ పంచాయితీ కార్యదర్శికి, ఉన్నతాధికారుల అండ దండలు పుష్కలంగా ఉన్నట్లు సమాచారం.. అందుకు అనుగుణంగానే సంగారెడ్డి జిల్లా పంచాయితీ అధికారి సురేష్ మోహన్ ప్రభుత్వ భూమి కబ్జా చేసి విల్లాలు నిర్మిస్తే తప్పేంటి..? అనడం అందుకు నిదర్శనం.. అమీన్ పూర్ మండలంలోని ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసిన చంద్ర శేఖర్ వ్యవహారంలో గ్రామ పంచాయితీ కార్యదర్శితో పాటు ఉన్నతాధికారులకు భారీగా ముడుపులు అందాయంటూ స్థానికంగా జోరుగా ప్రచారం సాగుతోంది.. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలం కళ్లెదుటే కబ్జాకు గురౌతుంటే కాపాడాల్సిన అమీన్ పూర్ మండల తహశీల్దార్ దశరథ్ మౌనం వహిస్తుండటం దేనికి సంకేతం..? అమీన్ పూర్ మండలంలో ప్రభుత్వ భూములను కాపాడే అధికారులు కరువయ్యారు అని స్థానిక ప్రజలు చర్చించుకోవడం గమనార్హం.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడు పటేల్ గూడ సర్వే నెంబర్ 12 లోని ప్రభుత్వ భూమిని కబ్జాచేసి భారీ నిర్మాణాలు చేపట్టాడు.. గతంలో అధికారులు పలుమార్లు కూల్చివేతలు చేపట్టినా తగ్గేది లేదంటూ తిరిగి యదేచ్ఛగా నిర్మాణం చేపట్టడం వెనుకాల ఎమ్మేల్యే అండ దండలు పుష్కలంగా ఉన్నాయని ఈ ప్రాంతంలో బహిరంగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. బి.అర్.ఎస్ నాయకుల కబ్జాలతో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని బి.అర్.ఎస్ నాయకులే చర్చించుకోవడం చూస్తుంటే.. రాబోయే ఎన్నికల్లో బి.అర్.ఎస్. అభ్యర్థులకు గడ్డు కాలం ఎదురయ్యే పరిస్థితి నెలకొని ఉందని స్పష్టమవుతుంది.. ఇప్పటికైనా ప్రభుత్వంలోని పెద్దలు స్పందించి.. దిద్దుబాటు చర్యలు చేపట్టి, పార్టీ పరువును కాపాడి, కబ్జాలకు అండగా నిలుస్తున్న అధికారులపై కొరడా ఝుళిపించి చర్యలు చేపడతారంటే ప్రశ్నార్ధకమే..? సంగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్న అధికారుల పై సి.సి.ఏ. రూల్స్ ప్రకారం చర్యలు తీసుకొని.. అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూమిని కాపాడి.. అక్రమ నిర్మాణాలను తక్షణమే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.. అమీన్ పూర్ మండల పరిధిలో జరుగుతున్న భూ అక్రమాలకు సంబంధించి మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ‘ ఆదాబ్ హైదరాబాద్ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్రం ‘..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు