Saturday, May 18, 2024

చంద్రబాబు డైరెక్షన్.. రేవంత్ యాక్షన్..( చంద్రభూతం రేవంత్ రూపంలో తెలంగాణ రైతుల అస్తిత్వంపై, ఆత్మగౌరవంపై దాడి చేస్తుండు.. )

తప్పక చదవండి
  • బ్లాక్ మెయిల్ చేసి బ్రతికే రేవంత్ రెడ్డి.. అతనికి వ్యవసాయం గురించి ఏమి తెలుసు..?
  • సూటిగా ప్రశ్నించిన బీ.ఆర్.ఎస్. నాయకుడు దాసోజు శ్రవణ్..
  • రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ ఉండాలి..రైతులకు వద్దా..?
  • మూడు గంటల్లో మూడు ఎకరాలు నీళ్లు ఎలా పారుతాయి..?
  • మాటలు కాదు ఏదైనా చేసి చూయించాలి..
  • అన్నదాతలను తూలనాడుతున్న అతనిది అహంకారం..
  • తెలంగాణ కాంగ్రెస్ ను – తెలుగుదేశం కాంగ్రెస్ గా మార్చిండు..
  • ఇవి రేవంత్ రెడ్డి మాటలు కాదు ..చంద్రబాబు తోలుబొమ్మలా ఆడిస్తుండు..

తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కరెంట్ ఫై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్‌ ఇస్తామని, ఒక ఎకరానికి నీళ్లు పట్టాలంటే ఒక గంట సరిపోతుంది.. అలాంటప్పుడు నిరంతరాయ విద్యుత్‌ ఎందుకు అన్నట్లుగా రేవంత్ వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ జిల్లా బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి దాసోజు శ్రవణ్‌ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ వ్యాఖ్యలపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు.

సీఎం కేసీఆర్‌ రైతులకు కొండంత అండగా నిలిచి అన్ని విధాలుగా ఆదుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం రైతుల పొట్ట‌గొట్టేందుకు చూస్తుంద‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్ , టీడీపీ పాల‌న‌లో క‌రెంట్ లేక రైతులు అరిగోస ప‌డ్డార‌ని, స్వ‌రాష్ట్రంలో పుష్క‌లంగా సాగునీరు, నాణ్య‌మైన నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతుల‌ను మళ్లీ చీక‌ట్లోకి నెట్టేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మొద‌టి నుంచి కాంగ్రెస్ కు రైతులంటే చిన్న చూపు. మొన్న ధ‌ర‌ణి వద్దన్నారు.. ఇప్పుడు వ్య‌వ‌సాయానికి మూడు గంట‌ల విద్యుత్ స‌ర‌ఫ‌రా స‌రిపోతుంద‌ని రేవంత్ అంటున్నాడు. దీనిని బట్టే కాంగ్రెస్ రైతు వ్య‌తిరేఖ పార్టీ అని అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. పేరుకు మాత్రమే రేవంత్ కాంగ్రెస్ మనిషినని, చేసిందంతా చంద్రబాబు కనుసైగలోనేనని శ్రవణ్ అన్నారు. బ్లాక్ మెయిల్ చేసి బ్రతికే రేవంత్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏమి తెలుసు..? రేవంత్ రెడ్డి ఇంట్లో 24 గంటల కరెంట్ ఉండాలి.. రైతులకు వద్దా. .? మూడు గంటల్లో మూడు ఎకరాలు నీళ్లు ఎలా పారుతాయో రేవంత్ రెడ్డి చూయించాలని..? అని శ్రవణ్ డిమాండ్ చేసారు. అలాగే అన్నదాతలను తూలనాడుతున్న రేవంత్ రెడ్డిది అహంకారం అని అన్నారు.

- Advertisement -

రాష్ట్రంలో ఎక్కడికిపొదాం ..ఏ ఉరికి పోదాం .. ఏ రైతు దగ్గరికి పోదాం.. ఎర్ర నెలలు ఉన్న రైతు దగ్గరికి పోదామా..? రేగడి నెలలు ఉన్న రైతు దగ్గరికి పోదామా చెప్పు.. నువ్వు అన్నట్లు మూడు గంటల్లో మూడు ఎకరాల్లో నీరు పారే పరిస్థితి ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా.. నువ్వు ఏం రాస్తావ్ రేవంత్ రెడ్డి..? టీపీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తావా..? అని రేవంత్ కు శ్రవణ్ సవాల్ విసిరారు. రైతాంగానికి అన్ని బాధల నుంచి శాశ్వత విముక్తి లభిస్తున్న తరుణంలో రేవంత్ రూపంలో కొత్త భాదవచ్చిపడిందన్నారు. కాంగ్రెస్ నిజ స్వరూపం ఏమిటో ఆయన వ్యాఖ్యలతో బయట పడిందని శ్రవణ్ అన్నారు. గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి 7 గంటలు ఇస్తామన్నారు.. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ 3 గంటల విద్యుత్ చాలు అంటుండు.

అసలు కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది?
అసలు పీసీసీ చీఫ్‌ రేవంత్ కు వ్యవసాయంపై అవగాహన ఉందా అని ప్రశ్నించారు శ్రవణ్. ఇక కాంగ్రెస్ జెండా పట్టుకున్న రైతులు ఆలోచించుకోవాలని సూచించారు. చంద్రబాబు వెళ్లిపోయినా ఆయన నీడలు, జాడలు తెలంగాణలో మిగిలే ఉన్నాయని రేవంత్‌ వ్యాఖ్యలతో తేలిపోయిందన్నారు. 2004 పరిస్థితులను 20 ఏండ్ల తర్వాత గుర్తుకుతెచ్చుకోవాల్సిన దౌర్భాగ్యం ఏర్పడిందన్నారు. గతంలో కాంగ్రెస్ ఆరు గంటలు కరెంటు ఇస్తే.. రేవంత్ తదితర టీడీపీ నేతలే ధర్నాలు చేసారు. మీ ఇంట్లో 24 గంటలు కరెంటు ఎందుకు ఉండాలి.. రైతులకు మాత్రం 24 గంటలు ఇవ్వోద్దా అని ప్రశ్నించారు. రైతులంటే కాంగ్రెస్‌కు ఇంత చిన్న చూపా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్టుబడి దారులకు 24 గంటల కరెంట్ ఉండాలి.. రైతులకు ఎందుకు ఉండకూడదని నిలదీశారు. ఎప్పుడంటే అపుడు కరెంట్ ఆన్ చేసుకునే వెసలుబాటు రైతులకు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటలు సరఫరా చేస్తున్నాడని శ్రవణ్ గుర్తు చేసారు.

రైతన్న సంక్షేమం కోసం ఏనాడూ ఆలోచించని కాంగ్రెస్ పార్టీ, కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. పార్టీ మారినా మనిషి మారలేదు.. మనసు కరగ లేదు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన బుద్ది చెప్పాలని శ్రవణ్ కోరారు. రైతును రాజు చెయ్యాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడ కూడా లేనివిధంగా రైతు సంక్షేమ పథకాల్ని ప్రవేశ పెట్టి వారి అభివృధ్ధికి కృషి చేస్తుంటే, మరోపక్క రైతుల పట్ల ఇంత ద్వేషంతో రేవంత్ రెడ్డి మాట్లాడడం అత్యంత హేయమైన చర్యని అని శ్రవణ్ మండిపడ్డారు. కేసీఆర్‌ నాయత్వంలోని తెలంగాణ ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి రైతుల కోసం ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా, ఏదైనా విపత్తు వస్తే ఆర్థిక సహాయం ఇలా రైతుల కోసం అహర్నిశలు పని చేస్తుందని శ్రవణ్ గుర్తు చేశారు. కేసీఆర్‌ పాలనలో రైతులకు అందుతున్న అన్ని పథకాల్నిమనమంతా గుర్తు చేసుకోవాలన్నారు. రైతులంతా విజ్ఞతతో అలోచించి ఇలాంటి నాయకుడిని, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని రైతులని కోరారు. పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్న కాంగ్రెస్‌ పార్టీకి బుద్ది చెప్పాలని , మరోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రికి చేయాలనీ ప్రజలను కోరారు శ్రవణ్. కాంగ్రెస్, టీడీపీ పాల‌న‌లో క‌రెంటు లేక రైతులు అరిగోసప‌డ్డార‌ని, స్వరాష్ట్రంలో పుష్కలంగా సాగునీరు, నాణ్యమైన నిరంత‌ర క‌రెంట్ స‌ర‌ఫ‌రాతో ఆర్థికంగా ఎదుగుతున్న రైతుల‌ను మళ్లీ చీక‌ట్లోకి నెట్టేసే కాంగ్రెస్ పార్టీ ప్రయ‌త్నాలను ప్రజ‌లు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ వ్యవసాయ రైతు వ్యతిరేక ఆలోచనా విధానానికి వ్యతిరేకంగా ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేప‌ట్టాల‌ని, కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మల దహన కార్యక్రమాల‌ను చేప‌ట్టాల‌ని కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు